తిప్ప ఎస్.ఐ బారి నుండి రక్షించండి 



 🔸 ప్రెస్ క్లబ్ లో బాధితులు ఆవేదన 


బోగోలు మండలం,  తిప్ప ఎస్.ఐతమనివేధిస్తున్నాడని, ఏనేరం చేయని తమ కుమారుడినివిచక్షణారహితంగా కొట్టాడని ఈమేరకు బాధితులు పట్టణంలోని స్ధానిక జర్నలిస్టుక్లబ్ నందు మీడియా సమావేశంలో తెలిపారు కడనూతల గ్రామంకు చెందిన 

 లింగంగుంట అంకమ్మ, రమణయ్యల పెద్ద కుమారుడు వేణుకుమార్ ఏ నేరం చేయనప్పటికీ,  ఇంటికి వచ్చి  పోలీసులు పిలుచుకు వెళ్ళి అతి దారుణంగా హింశించి , కాళ్ళు చేతులు పడిపోయేలా కొట్టారని అతనితల్లిదండ్రులువాపోయారు. ఈ విషయమై ఎస్.ఐ సుమన్  ని అడగగా దిక్కున్న చోట చెప్పుకోమని రైలు పట్టాల మీద వేసి ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరిస్తానని బెదిరించాడన్నారు. గత నాలుగు రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో కుమారుడు వేణుకుమార్ ను పెట్టుకుని ఉన్నామని, తలపై బాగా దెబ్బలు తగులున్నాయని అన్నారు. ఈ విషయంపై స్ధానికంగా కంప్లైంట్ ఇద్దామనుకున్నా ఎస్.ఐ సుమన్ బెదిరించడంతో నెల్లూరు వెళ్ళి అడిషనల్ ఎస్.పి వెంకటరత్నం కు తమ సమస్యను విన్నవించుకుని న్యాయం చేయమని కోరామన్నారు. ఎస్.ఐ సుమన్ ఆగడాలు మరీ ఎక్కువయ్యాయని ఆయన నుండి రక్షించాలని కోరారు