మహాత్వా జ్యోతిరావు పూలే ఆశయాలు దేశ ప్రజలందరికీ ఎప్పటికీ స్పూర్తి ప్రదాయకం అని, ఆదర్శమని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్.చక్రధర్ బాబు అన్నారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలకు అండగా నిలవడంతో పాటు.., బాలికా విద్య, వితంతు వివాహాలకు మద్దతుగా ఆయన పోరాటం చేశారన్నారు. నెల్లూరు నగరంలోని
జ్యోతిరావు పూలే సర్కిల్ నందు మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా శనివారం పూలే విగ్రహానికి కలెక్టర్ పుష్మమాల వేసి అంజలిఘటించారు.  అనంతరం మీడియాలో మాట్లాడుతూ..,
అందరికీ చదువు ఎంతో అవసరమని పాఠశాలలను ఏర్పాటు చేసి.., స్త్రీలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి మహిళా సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని అన్నారు. ఆయన భార్య సావిత్రిబాయ్ పూలే కూడా భర్త బాటలోనే నడుస్తూ మహిళా అభ్యున్నతికి అంకితమయ్యారన్నారు. జిల్లా అధికారులు అందరూ పూలే ఆశయాలను పాటిస్తూ.., బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అందించే సంక్షేమ ఫథకాల ఫలాలు అందించడానికి కృషిచేయాలన్నారు. నివర్ తుఫాను సమయంలో జిల్లాలో అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు 24 గంటలూ పనిచేస్తూ.., ప్రజలకు భరోసా ఇచ్చారని అభినందించారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులదని అన్నారు. ప్రజలు కూడా మహనీయుల గురించి తెలుసుకుని, తోటివారికి సహాయం చేయాలని, సేవచేసే స్పూర్తిని కలిగి ఉండాలన్నారు. 

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ సూర్య ప్రకాష్ రావు, మున్సిపల్ కమీషనర్ శ్రీ దినేష్ కుమార్, ఆర్.డి.ఓ శ్రీ హుస్సేన్ సాహెబ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు