దళితులుపట్ల జగన్మోహన్రెడ్డి తీరు మారాలి * *తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జన్ని. రమణయ్య
దళితులుపట్ల జగన్మోహన్రెడ్డి తీరు మారాలి * *తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జన్ని. రమణయ్య
వైకాపా అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో దళితులపై అనేక దాడులు జరిగాయి,దళితుల భూములు బలవంతంగా లాక్కున్నారు, దళి
త మహిళలు పై అత్యాచారాలు జరుగుతున్నాయి. అయినా కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గా కనీసం స్పందించని ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిందనని ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక దళితులకు ఉన్నటువంటి అన్ని సంక్షేమ పధకాలకీ జగన్మోహన్ రెడ్డి తూట్లు పొడిచారని దళితులకు ఎస్సి కార్పొరేషన్ ద్వారా అందవలసిన రుణాలను రద్దు చేశారని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో దళితులకు ఇస్తున్నటువంటి NSFDC,NSKFDC లాంటి రుణాలను నిలిపివేశారని,దళితులు ఉన్నత విద్య కోసం ప్రవేశపెట్టిన అంబేద్కర్ ఓవర్సీస్ విద్యాపధకాన్ని రద్దు చేశారని,మాకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించి మా హక్కుల కొరకు మేము పోరాటం చెయ్యడం కూడా ఈ ప్రభుత్వం దేశద్రోహ చర్యగా భావిస్తోంది అని ఈ రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ దళితులపైనే అట్రాసిటీ కేసులు బనాయిస్తోంది అని అన్నారు.ఈ రోజు విజయవాడలో దళితప్రతిఘటన లో పాల్గొని మా హక్కులకోసం ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తే దళితుల గొంతుని నొక్కేవిధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఎక్కడికక్కడ మా నాయకులను అక్రమ అరెస్ట్ లు చెయ్యడం దారుణమని ఈ జగన్మోహన్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని దుయ్యబట్టారు.
జిల్లా మహిళ అధ్యక్షురాలు పనబాక.భూలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇంటికి కూతవేటు దూరంలో దళితమహిళను అత్యాచారం చేస్తే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తుంది తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలేదని,అలాగే డాక్టర్ సుధాకర్ గారు మాస్కులు అడిగితే అతడిని పిచ్చివాడిగా చిత్రీకరించి ఆ మానసిక క్షోభతో చనిపోయేలా చేసిందని ఈ వైకాపా అధికారంలోకి వచ్చాక దళితులకు రక్షణ కరువైందని అన్నారు.
దళితుల ఓటు బ్యాంకు తో రాజ్యాధికారం పొందిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అదే దళితులపై ఉక్కు పాదం మోపుతున్నారని దళితులు రాబోవు ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దావా పెంచల్రావు ,జిల్లా కార్యదర్శి కనపర్తి. గంగాధర్ , తిరుపతి పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీపతి బాబు జిల్లా ఎస్సిసెల్ ప్రధాన కార్యదర్శి ద్వారా విజయబాబు, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు అరవ. కిశోర్, మాజీ కార్పొరేటర్ ప్రశాంత్,మందా రవి ,selvi,ప్రమీల ,వెంకట లక్ష్మి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు