విత్తు నుండి విక్రయం వరకు ఆర్ బి కే ల ద్వారా జరగాలి :  చైర్మన్.
 
రైతులు డ్రిప్ ను సద్వినియోగం చేసుకోవాలి: జేసి 

తిరుపతి, సెప్టెంబర్ 16: 

 రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మేరకు రైతు భరోసా కేంద్రాలలో విత్తు నుండి విక్రయం వరకు జరిగేలా పూర్తి స్థాయిలో  రైతులకు అందుబాటులోకి తేవాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి అద్యక్షులు రఘునాథ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో సలహా మండలి  సమావేశం మండలి అద్యక్షులు, మెంబెర్ కన్వీనర్ గా వ్యవహరిస్తున్న జేసి డి.కే.బాలాజీ నిర్వహించారు.  
వ్యవసాయ సలహా మండలి అద్యక్షులు మాట్లాడుతూ గ్రామాలలోనే ఆర్ బి కే లను నిర్మించి రైతులకు అందుబాటులోకి తీసుకుని వచ్చారని, ప్రధానంగా ఆర్ బి కే పరిధిలో అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచడం, విక్రయానికి కూడా రైతుల వద్ద దాన్యం సేకరణ చూడాలని అన్నారు. భవిష్యత్ తరాలకు పెస్టిసైడ్స్ లేని ఆహార దాన్యాలను అందించటం లక్ష్యంగా రైతులు మొగ్గు చూపాలని అన్నారు.  ఇప్పటికే టిటిడీ రైతు సంఘాలతో ఎం ఓ యు లు కుదుర్చుకుని 12 రకాల దాన్యాలను 15 శాతం అదనపు ధరతో తీసుకోనున్నదని తెలిపారు. 
జేసి మాట్లాడుతూ  డ్రిప్ పరికరాలకు రైతులు త్వరగా నమోదు చేసుకోవాలని ఐదు ఎకరాలాల లోపు ఉన్న రైతులకు 90 శాతం , 10 ఎకరాల లోపు ఉన్న వారికి 70 శాతం సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం అందించనున్నదని  సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.  స్ప్రింక్లర్ లకు  కూడా 55, 45 శాతం సబ్సిడీగా అందించనున్నామని  తెలిపారు. 365 రోజులు బీడు భూములుగా ఉంచకుండా నవ దాన్యాల సాగును ప్రోత్సహించాలని అందుకోసం వ్యవసాయ శాఖ అధికారులు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు.  జిల్లాలో మల్బరీ సాగుకు, ఆయిల్ ఫాం సాగుపై రైతులు మొగ్గు చూపాలని  కోరారు.  
ఈ సమీక్షలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి దొరసాని, పశు సంవర్థక శాఖ అధికారి వెంకటేశ్వరులు,  హార్టికల్చర్ అధికారి దశరథరామి రెడ్డి, సెరికల్చర్ అధికారిణి గీతారాణి, వ్యవసాయ సైంటిస్ట్ లు, ప్రగతిశీల రైతులు, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.