దార్శనికత కలిగిన మహనీయులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 130 వ జయంతి ను నెల్లూరు VR లా కలాశాలలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో సిబ్బంది,విద్యార్థులు మొక్కలు నాటి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి, అంబేద్కర్ ని స్మరించుకోవటం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ జయచంద్రబాబు మాట్లాడుతూ భారతదేశంలో అస్పృశ్యతను రూపుమాపేందుకు కు గొప్ప దార్శనికత ప్రదర్శించారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.ఈమహనీయుడు స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రిగా పని చేశారు. స్త్రీలకు సమాన హక్కుల కోసం ఆయన చేసిన కృషి మరువలేనిది.పీడిత వర్గాల అభ్యున్నతి కోసం అంబేడ్కర్ గారు పత్రికలు,సంస్థలు నడిపారు.అంబేడ్కర్ చూపిన బాటలో విద్యార్థులంతా ముందుకెళ్లాలన్నారు.కళాశాల అధ్యాపకులు రవి మాట్లాడుతూ అంబేడ్కర్ రచన అయిన రాజ్యాంగ ఫలాలు, ఎందరికో జీవితంలో ముందుకెళ్లేందుకు దోహదపడ్డాయి.భారత రాజ్యాంగం వలనే,అణగారిన ప్రజలు,ఈ సమాజంలో భాగస్వామ్యమయ్యారు.అంబేడ్కర్ అందరివాడు అంటూ మాట్లాడారు.ఈ కార్యక్రమములో విద్యార్థులు కూడా మాట్లాడారు.అంబేడ్కర్ గొప్పతనం గురించి,పీడిత వర్గాల కోసం ఆయన పడిన కష్టాల గురించి మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం,న్యాయ విద్యార్థుల బాధ్యత అన్నారు.ఈ కార్యక్రమములో కళాశాల సిబ్బంది,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.