వైఎస్సార్ భీమా పథకాలపై జిల్లా అధికారులతో సమీక్షా... జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు..,
నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు బుధవారం రాత్రి
జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు.., జగనన్న తోడు, వైఎస్సార్ భీమా పథకాలపై జిల్లా అధికారులతో సమీక్షా, సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే 60,867 మందికి జగనన్న తోడు ద్వారా రూ.60.86 కోట్లు చిరు *వ్యాపారులకు అందించామన్నారు. బ్యాంకర్లతో సమీక్షలు జరిపి లబ్ది దారులకు అందరి ఖాతాల్లో ఆ డబ్బులు జమ అయ్యాయో లేదో రివ్యూ చేయాలన్నారు. టెక్నికల్ కారణాల వలన అర్హులైన లబ్దిదారుల జగనన్న తోడు*
దరఖాస్తులను బ్యాంకర్లు తిరస్కరించరాదన్నారు. బ్యాంకు ఆర్.ఎం. లు, కంట్రోలర్లతో సమావేశం నిర్వహించాలని.., ప్రభుత్వ సంక్షేమ పథకాలపై బ్యాంకర్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని చేయాలన్నారు.
ఈ సమీక్ష, సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి, ఇంచార్జి జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, మెప్మా పి.డి., అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.