కావలి నియోజకవర్గం లో శనివారం ఉదయం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకుమంత్రులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
July 24, 2021
ap
,
inaguration
,
Kavali
,
ministers
,
mlas
,
Nellore
,
YSRCP
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర పరిశ్రమలు, ఐ. టి. శాఖ మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు, కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తో కలిసి కావలి నియోజకవర్గం లో శనివారం ఉదయం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత
మంత్రులు కావలి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం సమీపంలో లో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైయస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్, ఆక్వా ల్యాబ్ , పశు సంవర్థక ల్యాబ్ లను మంత్రులు ప్రారంభించారు.అనంతరం కావలి మండలం లోని ఆముదాల దిన్నె గ్రామంలో 12 లక్షల రూపాయల వ్యయం తో నిర్మించిన సైడు కాలువలు మంత్రులు ప్రారంభించారు. తదుపరి ఆ గ్రామంలో జరుగుతున్న "జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో" భాగంగా మంత్రులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. తదుపరి తాల్లపలెం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను మంత్రులు ఈ సందర్భంగా పరిశీలించారు. తదనంతరం తాళ్ల పాలెం గ్రామంలో 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. తదుపరి తుమ్మలపెంట గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పి ఎం జి ఎస్ వై ఎఫ్ 3 క్రింద 9.42 కోట్ల రూపాయల వ్యయంతో లక్ష్మీపురం గ్రామం నుండి తుమ్మలపెంట, పెద్ద పట్టపు పాలెం, తిమ్మాపురం, నందేమ్మ పురం మీదుగా నెల్లూరు జిల్లా సరిహద్దు వరకు నిర్మించనున్న తారు రోడ్డు కు మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే అక్కడే 64.42 కోట్ల రూపాయల వ్యయంతో అల్లూరు, కావలి,దగదర్తి, బోగోలు మండలాల్లోని 240 ఆవాస ప్రాంతాలకు ఆర్డబ్ల్యూఎస్ కింద ప్రతి ఇంటికి కుళాయి ద్వారా రక్షిత మంచినీరు అందించే " జల జీవన్ మిషన్ " పైలాన్ను మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి సంయుక్త కలెక్టర్ శ్రీ గణేష్ కుమార్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శ్రీ శివ నారాయణ, డి డి శ్రీ ప్రసాద్,కావలి ఆర్డిఓ శ్రీ శీన నాయక్, డి ఆర్ డి ఏ పి,డి. శ్రీ సాంబశివారెడ్డి, డి పి ఓ శ్రీమతి ధనలక్ష్మి , డ్వామా పీడీ తిరుపతయ్య, విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీ సుకుమార్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీ బీదా మస్తాన్ రావు ఎంపీడీవో శ్రీ వెంకట సుబ్బారావు తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. ---