నూతన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించిన కమిషనర్ వికాస్ మర్మత్, ఐ.ఏ.యస్
నూతన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించిన కమిషనర్ వికాస్ మర్మత్, ఐ.ఏ.యస్.,
నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ప్రాంగణంలో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కమిషనర్ వికాస్ మర్మత్ అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నూతన కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో నగర వ్యాప్తంగా మెరుగైన పారిశుధ్య సేవలు అందించడం సాధ్యమవుతుందని, పారిశుధ్య నిర్వహణ పనులను నిరంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే పర్యవేక్షించే సాంకేతికతను సెంటర్ లో ఏర్పాటు చేశామని తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నగర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ది పనుల పర్యవేక్షణతో పాటు, నగరపాలక సంస్థ అన్ని విభాగాల సమీక్ష సమావేశాలు, మునిసిపల్ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లు, ప్రకృతి విపత్తు నిర్వహణ కేంద్రం సేవలు, స్పందన పరిష్కార వేదిక, నగరపాలక సంస్థ సమగ్ర సమాచార విభాగం వంటి వివిధ విధులను నిర్వహించనున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు సంజయ్, సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగర పాలక సంస్థ.