భారత దేశంలో త్వరలో హైడ్రోజన్ ఇంధనంతో రైళ్ళు పరుగులు పెట్టనున్నాయి. జర్మనీ, పోలాండ్లలో ప్రస్తుతం హైడ్రోజన్ ఇంధనంతో రైళ్ళ ట్రయల్ రన్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే మనదేశంలో సైతం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అధారిత టెక్నాలజీ కోసం కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ బిడ్లను అహ్వానించింది.

డీజిల్ రైళ్ళకు హైడ్రోజన్ ను ఉపయోగించి నడిపేందుకు అవకాశం ఉంటుందో లేదో తొలుత పరీక్షించనున్నారు. ఈ పరిజ్ణానాన్ని ఉత్తర రైల్వేలోని సోనిపట్-జింద్ సెక్షన్ లోని డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

డీజిల్ రైలును హైడ్రోజన్ గా మార్చటం ద్వారా సంవత్సారానికి 2.3కోట్ల ఖర్చు అదా చేయటంతోపాటు కార్బన్ ఉద్ఘారాలను తగ్గించి కాలుష్యాన్ని నివారించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ పైలట్ ప్రాజెక్టు విజవంతంగా అమలు చేసిన తరువాత ట్రాక్ లన్నీ విద్యుదీకరణ చేయటంతోపాటు, హైడ్రోజన్ ఫ్యూయల్ తో రైళ్ళను నడపాలన్న ఆలోచనతో ఉన్నారు.

హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అధారిత డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ బిడ్డింగ్ సెప్టెంబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 5న ముగుస్తుంది. హైడ్రోజన్ ఇంధనం, సౌరశక్తి నుండి నీటిని ఎలెక్ట్రోలైజింగ్ చేయటం ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి అవుతున్నందున ఇది, హరిత వంతమైన రైల్వే రవాణాకు మార్గం సుగమమవుతుంది.

Dailyhunt