దళిత భూములలో దళితులకె నివాస స్థలాలు ఏర్పాటు చేయాలి....!!ప్రపంచ మానవ హక్కుల సంఘం చైర్మన్ సుబ్బారెడ్డి
July 07, 2020
humanrights
,
lands
,
Marripadu
,
Nellore
,
subbareddy
,
world
నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం పొంగురు గ్రామంలో, ఇళ్ల స్థలాలు పంపిణీ విషయంలో గత రెండు రోజుల కిందట రెవెన్యూ అధికారులు కు,గ్రామస్తులు కు,మధ్య వివాదం నెలకొన్న విషయం తెల్సిందే....
ఈ సంఘటన పై ఈ రోజు పొంగురు గ్రామంలో క్షేత్ర స్థాయిలో వెళ్లి బాధితులు తొ మాట్లాడి, ఇళ్ల స్థలాలు ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దాదాపు ముప్పై, నలబై సంవత్సరాలు ఈ భూమి దళితుల అధీనంలో, ఉంది అని, ఈ స్థలం స్మశానవాటికాగా వినియోగించు కుంటున్నారు,అని అన్నారు. ఈ స్థలం లో మాకు(దళితులకు) మాత్రమే ఇళ్ల స్థలాలు ఇస్తాము అని అధికారులు తెలపడంతో ఈ స్థలాన్ని ఇళ్ల స్థలాలు అనుమతి ఇచ్చాము అని,కానీ అధికారులు ఇప్పుడు ఈ స్థలంలో దళితులకు కాకుండా వేరే వాళ్లకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారు అని అందువలన గ్రామంలోని దళితులు ,అడ్డుకున్నారు అని అన్నారు..కావున ప్రభుత్వం, అధికారులు ఈ స్థలం లో దళితులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని తెలిపారు, దళిత స్త్రీ ల పట్ల అసభ్యంగా మాట్లాడిన మండల తహశీల్దార్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.. ఈ విషయం పై మానవ హక్కుల కమిషన్ కు పిర్యాదు చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రపంచ మానవ హక్కుల సంఘం జిల్లా లీగల్ అడ్వైజర్ నందా ఓబులేసు, జిల్లా వర్కింగ్ చైర్మన్ జ్యోతి శ్రీనివాసులు పాల్గొన్నారు..