కోవిడ్ మృతదేహాల అంత్యక్రియలను అడ్డుకోవడం నేరం * జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కరుణ కుమార్
August 07, 2020
ap
,
chittoor
,
court
,
doctor
,
high court
,
karunakar kumar
,
kovid
,
legal cell
,
virus
* జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కరుణ కుమార్
చిత్తూరు : కరోనా వైరస్ తో మృతి చెందిన వారి అంత్యక్రియలను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కరుణ కుమార్ చెప్పారు. కరోనా వైరస్ తో మరణించిన వారి అంత్యక్రియలకు సంబంధించి హైకోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలపై శుక్రవారం సాయంత్రం నాగయ్య కళాక్షేత్రంలో నగర పాలక సంస్థ అధికారులు, వార్డు కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కరుణ కుమార్ మాట్లాడుతూ... దేశంలో ప్రతి ఒక్కరికి గౌరవప్రదంగా జీవించేందుకు రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించబడింది అన్నారు. కానీ ప్రస్తుతం కొన్నిచోట్ల కరోనా వైరస్ తో మృతి చెందిన వారి అంత్యక్రియలు, దహన సంస్కారాలను అడ్డుకుంటున్న సంఘటనలు జరుగుతున్నాయని... వీటిని నివారించేందుకు హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. వైరస్ తో మృతి చెందిన వారి కైలాస యాత్ర శాంతియుతంగా జరిగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించిందన్నారు. అంత్యక్రియలు వ్యతిరేకించడం, అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని, మృతిచెందిన వారి శరీరంలో వైరస్ ఉండదని శాస్త్రీయంగా కూడా చెప్పడం జరిగిందన్నారు. వీటిపై అవగాహన పెంచుకుని అంత్యక్రియలు అడ్డుకో రాదన్నారు. కరుణ వైరస్ మృతుల దేహాలు అంత్యక్రియలు అడ్డకోవడాన్ని నేరంగా పరిగణించి కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నగర కమిషనర్ విశ్వనాథ్ పిలుపునిచ్చారు.