రెడ్ క్రాస్ కి సేవ చేస్తున్నామనే  ముసుగులో చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన వెంటనే రాజీనామా చేయాలని రెడ్ క్రాస్ పరిరక్షణ కమిటీ నేత కాకు మురళీ రెడ్డి డిమాండ్ చేశారు. రెడ్ క్రాస్  కార్యాలయం వద్ద సోమవారం పలువురు బైఠాయించి ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా మురళి రెడ్డి మాట్లాడుతూ దాతలు ఎంతో సహృదయంతో ప్లాస్మా అందిస్తుంటే దానితో కూడా వ్యాపారం చేసిన ఘనత చైర్మన్ కు దక్కుతుందని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. రెడ్ క్రాస్ పాలకవర్గం ఏర్పడి సంవత్సరం కూడా గడవలేదని కానీ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయన్నారు. సేవ ముసుగులో రెడ్ క్రాస్ ద్రోహులుగా మారిన వారికి తగిన గుణపాఠం తప్పదన్నారు.. శాంపిల్స్ లేకుండా ఏ విధంగా ప్లాస్మా ఇస్తారని ప్రైవేట్ హాస్పిటల్స్ తో ఎందుకు కుమ్మక్కయ్యారని ఆయన ప్రశ్నించారు. చనిపోయిన వారి పేర్లతో కూడా ప్లాస్మా బయటకు వెళ్లిందని ఆరోపించారు.. దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకొని పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు