నాయుడుపేట:-
జాతీయ రహదారి పై ఓజిలి మండలం రాజుపాలెం వద్ద శనివారం రాత్రి రూ 30 లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లను ఎస్ ఈ బి ,సి ఐ అబ్ధుల్ జలీల్ తన సిబ్బంది తో కలసి నిర్వహించన తనికీల్లో భాగంగా పట్టుకున్నారు.ఈ సందర్భంగా స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్ ఈ బి ఫై ఎస్ పి లు బి.వెంకటేశ్వర్లు,ఈ. శ్రీనివాసరావు , మాట్లాడారు. కర్ణాటక లోని తుముకూరు నుండి కాకినాడ లోని తారా ఏజెన్సీ కి సుమారు రూ 30 లక్షల విలువ గల 50 బస్తాలు (15 లక్షల 60 వేల గుట్కా ప్యాకెట్లు)గుట్కా ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తున్న లారీ ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.లారీ లోని ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.అక్రమ గుట్కా,మద్యం,పేకాట,కోడిపందెలా నివారించేందుకు ప్రజలు సహకరించాలన్నారు.వేటు వివరాలు తెలియజేసే వారి పేర్లు గోప్యం గా ఉంచుతామన్నారు.జిల్లాలో కోడి పందేల పై దాడులు నిర్వహించి అరెస్ట్ చేసిన
నాయుడుపేట ఎస్ ఈ బి,సి ఐ
షేక్. అబ్దుల్ జలీల్,ఎస్ ఐ శేషమ్మ లను అభినందించారు.నాయుడుపేట సర్కిల్ పరిధిలో అక్రమ మద్యం,గుట్కా వ్యాపారాన్ని నివారించేందుకు కృషి చేస్తున్న సి ఐ, అబ్దుల్ జలీల్,శేషమ్మ లు అభినందించారు.ఈ సనవేశం లో ఎస్ ఈ బి,సి ఐ అబ్దుల్ జలీల్,ఎస్ ఐ శేషమ్మ వున్నారు.