గల్ఫ్‌ దేశం ఒమన్‌కు వెళ్లాల్సిన అన్ని విమానాలను నిలిపివేస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. వారం రోజుల పాటు రెండు దేశాల మధ్య రాకపోకలు నిలిపివేసినట్లు ఎయిర్‌ ఇండియా తెలిపింది. ఒమన్‌ వారం పాటు అన్ని దేశాలకు చెందిన విమానాలను మూసివేయాలని సుల్తానేట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎయిరిండియా విమానాలను రద్దు చేసింది. ఇప్పటికే బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాలను కేంద్రం ఈ నెల 31వ వరకు రద్దు చేసింది. కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ వ్యాప్తి దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయాలలో కొవిడ్‌ టెస్టులు నిర్వహిస్తామని, పరీక్షల్లో పాజిటివ్‌ వస్తే నిర్బంధ క్వారంటైన్‌కు పంపనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. సోమవారం అర్ధరాతి నుంచి యూకే నుంచి వచ్చిన విమానాలపై సస్పెన్షన్‌ విధిస్తుండగా.. ఈ ఏడాది చివరి రోజు అర్ధరాత్రి వరకు తాత్కాలిక నిషేధం కొనసాగుతుందని మంత్రిత్వశాఖ పేర్కొంది.