నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో



కోవిడ్ సమయంలో కష్టనష్టాలకు ఎదురొడ్డి,అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వైద్యసేవలు అందించిన డెంటల్ డాక్టర్లు,ఆయుష్ డాక్టర్ల సేవలు ఎనలేనివి....రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి


🔹 పేషేంట్లను తాకాలంటేనే భయపడుతున్న సమయంలో నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో షుమారు 150మంది డెంటల్ డాక్టర్లు,ఆయుష్ డాక్టర్లు అందించిన సేవలను అభినందిస్తున్నా.....రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 


🔹 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రం మొత్తం 70వేలు జీతం రావాల్సి ఉండగా, గౌరవ ముఖ్యమంత్రివర్యులు స్పందించి, కోవిడ్ సమయంలో విధులు నిర్వర్తించిన ఆయా డాక్టర్లకు జీతాలు అందించటానికి ఏర్పాట్లు చేయటం జరిగింది. నెల్లూరు ప్రభుత్య ప్రధాన వైద్యశాలలో 50వేలు జీతం మాత్రమే చెలిస్తామంటున్నారని డాక్టర్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కలసి ఆవేదన వ్యక్తం చేసారు.  స్పందించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అక్కడినుంచే జిల్లా కలెక్టర్ గారితో ఫోన్లో మాట్లాడి 70వేల జీతం వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ కి ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ గారిని కోరారు.