రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద పలుగ్రామపంచాయతీ లలో పారిశుద్ధ్య పనులు నిర్వహణ....... జడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి.......
August 08, 2020
ap
,
chittoor
,
goverment
,
zptc
0808
రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద పలుగ్రామపంచాయతీ లలో పారిశుద్ధ్య పనులు నిర్వహణ....... జడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి....... గ్రామ పంచాయతీల్లో పైలెట్ ప్రాజెక్టులతో పాటు గ్రామాలకు కావాల్సిన పారిశుద్ధ్య పనుల పై గ్రామానికి కావాల్సిన పనులను ఎంపిక చేసేందుకు సర్వే గత 15 రోజులుగా జరుగుతోందని జడ్పి ఇంచార్జి సి ఈ ఓ ప్రభాకర రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలో ప్రభుత్వం నిర్ణయం మేరకు జిల్లాలో మండలానికి రెండు గ్రామాల చొప్పున 130 గ్రామ పంచాయతీలను పైలట్ ప్రాజెక్టు కింద కి తీసుకొస్తూ మే నెల 14న ప్రభుత్వం జీవో జారీ చేసిందని మనం మన పరిశుభ్రత ప్రాజెక్టులో భాగంగా ఎంపికచేసిన గ్రామాల్లో పరిశుభ్రతను పాటించెందుకుపదిహేను రోజులపాటు ఇంటింటా సర్వే నిర్వహిస్తూ గ్రామాల్లో చేయాల్సిన పనులను గుర్తిస్తూ గ్రామస్తులతో సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు ఇప్పటికే చాలా పంచాయతీలు చేయాల్సిన పనులు గురించి ఎంపిక చేయడం జరిగిందని గ్రామస్థాయిలో ఉన్న సచివాలయ ఉద్యోగుల తో గ్రామస్తులు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొంటున్నారని వారి స్థాయిలో పూర్తి చేసే పనులు అయితే వారే పరిష్కరించుకుంటారు అని గ్రామంలో ఏవైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుందని ఆ నివేదిక ద్వారా ప్రభుత్వం నిధులను విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. ఈనెల 15వ తేదీలోపున టాస్క్ ఫోర్స్ టీం లు గ్రామస్థాయిలో చేయాల్సిన పనులను గురించి నివేదికను తయారు చేస్తారని ,ఈ నివేదిక జిల్లా స్థాయి అధికారులకు చేర్చి దానిద్వారా ఓ డి ఎఫ్ ప్లస్ గ్రామాలను ఎంపిక చేయడం జరుగుతుందని ఈనెల 20 తేదీ కల్లా ప్రభుత్వానికి నివేదికను పంపాల్సి ఉంటుందని సీఈఓ వెల్లడించారు. సమయం తక్కువ ఉన్నందున నివేదికలను వెంటనే పూర్తి చేయాలని సీఈఓ అన్నారు ఈ నెల 15 ఆ గ్రామాల్లో తయారు చేసిన నివేదికను మండల స్థాయి, ప్రజా ప్రతినిధులు లేదా గ్రామ పంచాయతీకి సంబంధించిన సభ్యుల ఎదుట వివరించాల్సి ఉంటుందని దీనికి సంబంధించి గ్రామ స్థాయిలో కూడా ఓ డి ఎఫ్ ప్లస్ వచ్చిన గ్రామాలతోపాటు ఇతర పైలట్ గ్రామాల్లో కూడా 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రార్థన నిర్వహించిన తర్వాత 10 నిమిషాల పాటు పరిశుభ్రత పక్షోత్సవాలు కు సంబంధించి గ్రామ నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని ఇందుకు ఈ వో లు, ఈవోపీఆర్డీ వారు కానీ హాజరు కావాల్సి ఉంటుందని అదేవిధంగా గ్రామంలో ఎంపిక చేసిన సమస్యలు తెలిసినవారు నలుగురు గ్రామ సమస్యలపై స్పందించాల్సి ఉంటుందని ,ముఖ్యఅతిథి మాట్లాడిన తర్వాత ఏదైనా ఆస్తుల పంపిణీ ఉంటే చేయాల్సి ఉంటుందని జీవోలో స్పష్టం చేశారు. ఈ విధంగా ఏర్పాటు చేసిన గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు పనులను చేపట్టి పరిశుభ్రతను కాపాడి ప్రజలను వ్యాధులనుంచి కాపాడడం జరుగుతుందని దీనికి సహకరించి గ్రీన్ అంబాసిడర్ లకు ఈ గ్రామం నుంచి ఇంటికి రెండు రూపాయల చొప్పున పంపించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో తాను ప్రోగ్రాం కో ఆర్డినేటర్ షణ్ముగారాం లు పర్యటించడం జరిగిందని ఇంచార్జి సి ఈ ఓ ప్రభాకర రెడ్డి అన్నారు.