తేది:10-04-2021
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలో సూరాయపాళెం, విరువూరు, మహమ్మదాపురం, ప్రభగిరిపట్నం, ఉలవరపల్లి, అమ్మవారిపాళెం గ్రామాలలో డా౹౹గురుమూర్తి గారిని అత్యధిక మేజారిటీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
👉 రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తికి భారీ మెజారిటీ సాధించడానికి ఉపయోగపడుతున్నాయి.
👉 "బక్కరెడ్డి" ఆధ్వర్యంలో పొదలకూరులో జరిగిన చంద్రబాబు సభ, జెండాలు తప్ప, జనాలు లేక వెలవెలబోయింది.
👉 "పిచ్చిబాబు" తాను ముఖ్యమంత్రిగా, "బక్కరెడ్డి" తాను మంత్రిగా ఏం చేశారో చెప్పుకోలేక, మాపై విమర్శలతో కాలయాపన చేసి వెళ్ళారు.
👉 చంద్రబాబు సభకు జనం విముఖత చూపడంతో, ₹1000/-లు కూలిచ్చి సభకు జనాలను తరలించారు.
👉 పదవి కోల్పోవడం, కొడుకు అసమర్థుడు కావడం, సోమిరెడ్డి లాంటి చీడపురుగులతో పార్టీ భ్రష్టుపడటం లాంటి సంఘటనలతో పాపం!, చంద్ర బాబుకు మతిభ్రమించి పిచ్చి పట్టినట్టు ఉంది.
👉పొదలకూరులో జరిగిన చంద్రబాబు సభకు జనం లేక పోవడంతో పిచ్చి పట్టిన చంద్రబాబు కాస్త "పిచ్చి బాబు" లా మారాడు.
👉 కేసుల మాఫీ కోసం "పిచ్చి బాబు" దగ్గరకు వెళ్లానంటూ ప్రకటనలు చేస్తున్న పిచ్చి వాడికి, బక్కవాడికి ఒక్క విషయం తెలియజేస్తున్నా...!
👉 "పిచ్చి బాబు" దగ్గరకు కేసులు మాఫీ చేయమని నేను కాదు కదా!, నా ఎడమ కాలు కూడా అడుగు వేయడానికి ఇష్టపడదు.
👉 సోమిరెడ్డి స్క్రిప్ట్ చదివి 2014లో మాపై కేసులు మాఫీ చేయమని కోరినట్లు చంద్రబాబు చెప్పడం చూస్తుంటే, పాపం!, చంద్రబాబు స్పృహ కోల్పోయినట్లు కనిపిస్తుంది.
👉 చంద్రబాబు బ్రతిమిలాడితే వినకపోతే, ప్రలోభ పెడితే లొంగకపోతే, బెదిరిస్తే భయపడకపోతే 2016లో మాపై కేసులు పెట్టడం జరిగింది.
👉 ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తాము తప్ప, చంద్రబాబు లాంటి నక్కలు, సోమిరెడ్డి లాంటి కుక్కలు మొరిగినంత మాత్రాన పట్టించుకోము.
👉 తెలుగుదేశం పార్టీలో నన్ను చేర్చుకోవడానికి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుండి మంత్రుల వరకు తీవ్ర ప్రయత్నాలు చేస్తే, "తల్లి పాలు తాగి, రొమ్మును గుద్దే నీచుని కాదని" సమాధానం చెప్పి పంపా..
👉అవినీతికి అలవాటైన "బక్క రెడ్డి" అవినీతి మరకలను అందరికీ అంటించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు.
👉 సోమిరెడ్డికి " కీర్తి.., కాంతం.. కనకం.." మీద ఉన్న వ్యామోహం ప్రజాసేవపై లేదు.
👉 నీతి, జాతి లేని సోమిరెడ్డి ఒక పార్టీలో ఉండి లోపాయికారితనంగా మరొక పార్టీకి మద్దతిచ్చే అలవాటు ఉండటంతో అందరూ తనలాగే అని భావిస్తాడు.
👉 తిరుపతి పార్లమెంటు ఎన్నికలో డాక్టర్ గురుమూర్తి గారికి భారీ మెజారిటీ సాధించి, సోమిరెడ్డిని తరిమి కొడదాం, చంద్రబాబుకు పట్టిన పిచ్చిని వదిలిద్దాం.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం గ్రామంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల ప్రచారం నిర్వహించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
స్క్రోలింగ్ పాయింట్స్:
👉 ఏప్రిల్ 8 వ తేదీ జరిగే ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో ఏప్రిల్ 17వ తేదీన జరుగనున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారు అందిస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తున్నాం.
👉 ఆంధ్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేయని విధంగా కరోనా నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని కుటుంబాలకు 3 కోట్ల 50 లక్షల విలువైన బియ్యం, వంటనూనెను పంపిణీ చేశాం.
👉 ఆంధ్రరాష్ట్రంలో ఏ శాసన సభ్యుడు సాధించని విధంగా 22 రెండు నెలల కాలవ్యవధిలో సర్వేపల్లి నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు, సిమెంటు డ్రైన్ల నిర్మాణం కోసం 320కోట్ల రూపాయలు, ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి అమర్చడం కోసం 36 కోట్ల నిధులు మంజూరు చేయించి, అభివృద్ధి పనులు చేపడుతున్నాం.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో మాదిరిగా వర్గాలు సృష్టించి, ఉద్రిక్తతలు రేకెత్తించి, రాజకీయ లబ్ది ఆశించకుండా, సర్వేపల్లి నియోజకవర్గాన్ని శాంతి, సామరస్యాలతో తీర్చిదిద్దుతున్నాం.
👉 పోటీ చేయడం, ఓటమి పాలవడం ఎన్నికలు వస్తే పగటి వేషాలు వేసుకుని ప్రజలను మభ్యపెట్టే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
👉 తిరుపతి పార్లమెంటు పరిధిలోని మన సర్వేపల్లి నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓట్లు పోలింగ్ చేయించి, భారీ మెజారిటీతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తిగారిని గెలిపించుకోవడానికి కృషి చేద్దాం.
తేది:04-04-2021
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులతో పాటు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డా౹౹గురు మూర్తి గారికి అత్యధిక మెజారిటీ సాధించేందుకు ప్రచారం నిర్వహించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి
👉 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ధాటికి తట్టుకోలేక చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ అంటూ పలాయనం చిత్తగించాడు.
👉 ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సంతృప్తిగా ఉన్న ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలిచి, చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధమయ్యారు.
👉 చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు సిద్ధాంతాలు లేకుండా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని ఓడించడమే ధ్యేయంగా పని చేస్తున్నారు.
👉 చంద్రబాబు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చినప్పటికీ లెక్కచేయకుండా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రచారం నిర్వహించుకుంటూ, తెలుగుదేశం పార్టీ పోటీ లేని చోట్ల ఇతర పార్టీలకు మద్దతు ఇస్తున్నారు.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు ధాన్యం దొంగల అవతారమెత్తి, రైతులను దోచుకోవడంతో జైలుపాలయ్యారు.
👉 వ్యవసాయ శాఖ మంత్రిగా పనికిరాని ఉత్తర్వులు ఇచ్చి, ప్రలోభపెట్టే ప్రయత్నం చేసి, రైతుల చేత తిరస్కరింపబడిన వ్యక్తి, రైతుల గురించి ముసలి కన్నీరు కారుస్తున్నాడు.
👉 వ్యవసాయ శాఖ మంత్రిగా రైతులను అడ్డుపెట్టుకొని, గిట్టుబాటు ధర కల్పించకుండా, నీరు-చెట్టు, రైతు రథం లాంటి కార్యక్రమాల పేరిట వందల కోట్లు ప్రజా సొమ్ము దోచుకున్నాడు.
👉 అవినీతి సంపాదన ద్వారా వచ్చిన సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేసి, అందలమెక్కాలని ఆశపడ్డ వారికి, ఘోరపరాజయం తప్పలేదు.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించడంతోపాటు, కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచి 3 కోట్ల 50 లక్షల విలువైన బియ్యం, వంటనూనెను పంపిణీ చేశాం.
👉 కరోనా నేపథ్యంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా భావించి మేము పని చేస్తే ,తెలుగుదేశం నాయకులు తమకు ఎక్కడ కరోనా వస్తుందోనని ముసుగుతన్ని పడుకొని, ప్రజలను పట్టించుకోకుండా వదిలేశారు.
👉 సర్వేపల్లి నియోజకవర్గాన్ని "సోమిబాబా-తెలుగు దొంగలు" అధికారాన్ని అడ్డుపెట్టుకొని, పంచభూతాలను దోపిడీ చేశారు.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అందరం కష్టించి పనిచేసి, అత్యధిక పోలింగ్ శాతం సాధించడంతో పాటు, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి గారికి భారీ మెజారిటీ సాధించేందుకు తీవ్రంగా కృషి చేద్దాం.
👉 ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, అత్యధిక మెజారిటీతో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేసి, సర్వేపల్లి నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలుపుదాం.
తేది:04-04-2021
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, పైనాపురం గ్రామం నుండి దాసరి బాలయ్య (టిడిపి సర్పంచ్ అభ్యర్థి), దాసరి రమేష్ (గ్రామ కమిటీ అధ్యక్షుడు), దారా పోలయ్య, పెడకల వెంకటరమణయ్య, కావలి ప్రసాద్, కావలి యానాదయ్యతో పాటు 100 కుటుంబాలు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి చేరిక. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, వన్నెకుల క్షత్రియ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ నెల్లూరు శివ ప్రసాద్ పాల్గొన్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, పంట పాళెం గ్రామంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన యం.పీ.టీ.సీ., జెడ్పీటీసీ అభ్యర్థులతో పాటు తిరుపతి ఉప ఎన్నికలో డా౹౹గురుమూర్తి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసినదిగా ప్రచారం నిర్వహించి, కరపత్రాలు పంపిణీ చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
👉 కరోనా కష్టకాలంలో సర్వేపల్లి నియోజకవర్గంలో 3 కోట్ల 50 లక్షల విలువైన బియ్యం, వంటనూనె పంపిణీ చేశాం.
👉 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు.
👉 మనకి అన్ని విధాలా అండగా నిలిచిన ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు అందించి ఎంపిటిసి, జెడ్పిటిసి అభ్యర్థులతో పాటు అత్యంత కీలకమైన తిరుపతి ఉప ఎన్నికలో మన అభ్యర్థి గురుమూర్తి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవలసిన బాధ్యత మనపై ఉంది.
👉 మిల్లర్ల దగ్గర ముడుపులు మింగి, ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించకుండా రైతుల నడ్డి విరిచిన వారికి అధికారం కోల్పోయిన తరువాత రైతులు గుర్తుకురావడం హాస్యాస్పదం.
👉 వ్యవసాయ శాఖ మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని రైతుల పేరిట దోచుకున్నవారికి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు.
👉 స్థానిక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చి, ఆసక్తి ఉన్న చోట పోటీ చేయవచ్చు అంటూ, చంద్రబాబు ప్రకటనలు చూసి ప్రజలు ఆయనకు పిచ్చి పట్టినట్టు భావిస్తున్నారు.
👉 చంద్రబాబును రాష్ట్ర ప్రజలే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఖాతరు చేయడం లేదు.
👉 చంద్రబాబు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించినా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మాత్రం తమను గెలిపించాలని ప్రచారం చేసుకుంటూ, చంద్రబాబు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, తిరుగుతున్నారు.
👉 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీలో లేని చోట బిజెపి లాంటి ఇతర పార్టీలకు తెలుగుదేశం పార్టీ మద్దతివ్వడం అనైతికం.
👉 తిరుపతి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా ఇవ్వలేదంటూ బీజేపీ పై దాడి చేస్తున్న తెలుగుదేశం పార్టీ, స్థానిక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో లోపాయికారితనంగా బిజెపికి మద్దతివ్వడాన్ని చూసి, జనం నవ్వుకుంటున్నారు.
👉 తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా తయారైందని రుజువు చేద్దాం.
గురుమూర్తి కి ఆశీస్సులందించండి."శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గరనుండి మొత్తం పార్టీనంతా సమాయత్తం పరిచి, అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో దిమ్మ తిరిగిన విధంగానే మరోసారి ఘోరపరాజయం తప్పదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు అందరం కలిసికట్టుగా పని చేద్దాం.
"సర్వేపల్లిలో అట్టహాసంగా రెండో విడత అమ్మఒడి కార్యక్రమం."
ఆట పాటలతో ఆలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు.
ట్రిపుల్ ఐటీలో ప్రతిభ కనబరచి, అడ్మిషన్లు సంపాదించిన విద్యార్థులను సన్మానించిన ఎమ్మెల్యే కాకాణి.
స్క్రోలింగ్ పాయింట్స్:
👉 సృష్టిలో అమ్మ ఒడి మాధుర్యాన్ని అనుభవించని బిడ్డ ఉండదు.
👉 బిడ్డలకు వయసు వచ్చేకొద్ది స్కూళ్లకు వెళ్లడం ప్రారంభించిన తర్వాత క్రమేపీ అమ్మ ఒడికి దూరమవుతారు.
👉 స్కూళ్లకు వెళ్లే బిడ్డలకు కూడా అమ్మఒడి మాధుర్యాన్ని కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టారు.
👉 భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో రెండో విడత అమ్మఒడి పథకం కింద 23,112 తల్లుల ఖాతాల్లో 34 కోట్ల 66 లక్షల 80వేల రూపాయల నిధులు జమ చేశారు.
👉 "జగనన్న అమ్మ ఒడి" ద్వారా ఆర్ధిక సహాయం, "నాడు - నేడు" పేరిట పాఠశాలల అభివృద్ధి, "జగనన్న విద్యా కానుక" కిట్లు, "జగనన్న గోరుముద్ద" పేరిట పోషకాహారం అందజేత లాంటి కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తున్నారు.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో అమ్మ ఒడి పథకాన్ని విజయవంతంగా అందించడానికి సహకరించిన మండల విద్యా శాఖ అధికారులకు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, అధ్యాపకులకు, సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు నా ప్రత్యేక ధన్యవాదాలు.
నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం గ్రామంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలుగా బాసిల్లుతున్న సిద్ధేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి దేవస్థానాలకు 3 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
👉సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా పేరొందిన సిద్దేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి దేవస్థానం పునర్నిర్మాణంతో పాటు, అవసరమైన వసతులు కల్పించడానికి 25 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో భక్తుల సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం.
👉 ఆలయాలకు దాతల ద్వారా సంక్రమించిన ఆస్తులను కాపాడుకునేందుకు ప్రజలందరూ సహకరించాలి.
👉 తెలుగుదేశం హయాంలో మూలస్థానేశ్వర స్వామి, వేణుగోపాలస్వామి ఆలయాలకు చెందిన సొమ్మును విరాళాల రూపంలో ఇతర జిల్లాలకు తరలించడాన్ని అడ్డుకున్నాం.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలకు కమిటీలను నియమించడంతో పాటు, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, సజావుగా పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
👉 రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆదరణతో పాటు భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నా.
👉సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రముఖ దేవాలయాలన్నింటినీ క్రమ పద్ధతిలో అవసరమైన పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడుతాం.