ప్రముఖ గాయకుడు సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు  తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన గానగంధర్వుడైన నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయప్రకాశ్ అన్నారు  .శుక్రవారం ఘంటసాల 98వ జయంతి సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  జీవితంలో ఎన్నో కష్టాలు పడి  ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి ఘంటసాల అని అన్నారు  .తండ్రి ఘంటసాల సూర్యనారాయణ గాయకుడు కావటంతో చిన్నతనం నుంచి పాటల మీద మమకారంతో  ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా తన తండ్రి ఆశయం కొరకు9వేల పాటలు పాడిన మహోన్నత వ్యక్తి అన్నారు  .సినీ పాటలతో పాటు  మధురమైన ప్రైవేట్ ఆల్బమ్ లు  కుంతివిలాపం పుష్పవిలాపం   దేశభక్తి గీతాలతోపాటు చనిపోతాను అని తెలిసి కూడా భగవద్గీతను ప్రపంచానికి అందజేసిన త్యాగమూర్తి ఘంటసాల అని ఆయన కొనియాడారు  .ఈ సందర్బంగా పాటల పోటీలు నృత్యపోటీలు ఏవీకె ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు విజేతలకు బహుమతులను అందజేశారు  .ఈ నారాయణ హెచ్ ఓ డి డాక్టర్ ఎన్ కన్నన్,సీనియర్ జర్నలిస్ట్ దయశెంకర్,గాయకుడు దుర్గం మధుసూదన్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది రమాదేవి,సామ్నా ప్రధాన కార్యదర్శి జి హనోక్,అరవరాయప్ప,కృష్ణమూర్తి,పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాఘవ మోసెస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఖేతా అంకుల్ నిర్వహించారు.