తొలిసారిగా లిక్విడ్ గంజాయి ద్రవాన్నినెల్లూరు స్పెషల్ ఎన్ఫోస్మెంట్ అధికారులు స్వాధీనం
నెల్లూరు స్పెషల్ ఎన్ఫోస్మెంట్ అధికారులు గంజాయి అక్రమ రవాణాపై మెరుపు దాడులు నిర్వహించారు.విశాఖపట్నం నుండి చెన్నైకి ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి రూపంలో ఉన్న ద్రావణాన్ని ,గంజాయిని సీజ్ చేశారు.. ముందస్తు సమాచారంతో నెల్లూరులోని సుబ్బారెడ్డి స్టేడియం వద్ద ఆర్టీసీ బస్సును అపి అధికారులు తనిఖీలు చేయగా.. అందులో గంజాయి గుర్తించారు..మరోవైపు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ద్రవ రూపంలో ఉండే గంజాయి ద్రవాన్ని స్వాధీనం చేసుకున్నారు.వీటి విలువ సుమారు నాలుగు లక్షల ముప్పై వేలు ఉంటుందని అధికారులు తెలిపారు.
విశాఖనుంచి బెంగుళూరు ,చెన్నై కు అక్రమంగా తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో ఈ దాడులు నిర్వహించామని తెలియజేశారు.జిల్లాలో తొలిసారిగా లిక్విడ్ గంజాయి పట్టుకోవటం జరిగిందన్నారు.
గంజాయి తరలిస్తున్న ప్రవీణ్ రాజ్,హరీష్ రాజ్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని తెలియజేశారు.