నెల్లూరు, జనవరి 23, (రవికిరణాలు) : గురువారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 38వ డివిజన్, శివగిరి కాలనీలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 90 మందికి కంటి అద్దములు ఉచితంగా అందించారు.ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లడుతూ అనాదలకు, పేదలకు మనం అండగా నిలిస్తే, ఆ భగవంతుడు మన కుటుంబాలకు అండగా నిలుస్తారన్నారు. రూరల్ నియోజకవర్గంలో పేదలు నివశించే కాలనీలు అనేకం ఉన్నాయని, పేదవాళ్ళందరికి అన్ని రకాల మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామని, శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు సైతం చేయిస్తామని అన్నారు. మా సోదరులు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ నియోజకవర్గంలో అనేక మెడికల్ క్యాంప్ లు నిర్వహించడం జరిగిందన్నారు. సామాన్యుడికి వైద్యం అందించాలనే విధంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి వైద్యం, మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. డివిజన్లలోని నాయకులు ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని, ప్రజల మధ్యనే ఉండడంతో పాటు, సామాజిక సేవా కార్యక్రమాలు చెయ్యాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పిలుపునిచ్చారు.