కరోనా టెస్టుల్లో దూసుకుపోతున్న ఏపీ..
అమరావతి: కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం దూసుకుపోతుంది. కరోనా నివారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. కరోనా పరీక్షలను సంఖ్య పెంచే విధంగా ప్రభుత్వ ఆదేశంతో ఆర్టీసీ అధికారులు కోవిడ్ ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు.మొత్తం 54 బస్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు 30 బస్సులను సిద్ధం చేసి అన్ని జిల్లాలకు పంపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి జిల్లాకు 4 కోవిడ్ టెస్ట్ బస్సులు పంపే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంజీవని బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి సామాన్యుడికి కోవిడ్ టెస్ట్ ఉచితంగా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. కరోనా టెస్ట్‌లు నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది.