*అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. పరిపాలన సాగుతోందా...?*
**డిజాస్టర్ మేనేజ్మెంట్లో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం*
**గ్రేట్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో 31 మంది చనిపోతే దిక్కు లేకుండా పోయింది*
*ప్రజల ప్రాణాల కంటే రెండు వేల కోట్లు ఎక్కువ కాదు...వెంటనే పొర్లు కట్టల మరమ్మతులకు టెండర్లు పిలవండి* .
*ఓటు వేసి గెలిపిస్తే అంతా మీ ఇష్టమా.జనం ప్రాణాలు తీసే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారు**
*ఇల్లు మునిగితే కడపలో రూ 5,800 నెల్లూరులో 2000 అందిస్తారా..ఇదెక్కడి న్యాయం*
*నెల్లూరులో మీడియాతో మాజీమంత్రివర్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.*
డిజాస్టర్ మేనేజ్మెంట్లో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది.
సాధారణ పరిపాలన కూడా సాగించలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉందా.. లేదో అర్థం కావడం లేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కంటే ఏ ముఖ్యమంత్రి అయినా బెటర్ గా పనిచేసేవారు.
ప్రస్తుతం రాష్ట్రంలో జరిగింది మానవ విధ్వంసం.
విపరీతమైన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తే ఎలాంటి చర్యలు చేపట్టారు.
కడప జిల్లాలో ప్రాజెక్టులు తెగిపోయి ఊర్లకు ఊర్లు కొట్టుకుపోతే.... నెల్లూరు జిల్లాలో మాత్రం జిల్లానే కొట్టుకుపోతుందని వదంతులతో ప్రజల భయపడే పరిస్థితి ఏర్పడింది.
సోమశిల నుంచి 5 లక్షల 40 వేల క్యూసెక్కుల నీరు విడుదలైతే ఊరికి ఊర్లు కొట్టుకు పోవాలా.
నెల్లూరు జిల్లాలోని ఇందుకూరు పేట మండలంలోనే మూడు వేల కోట్ల నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా ప్రజలు అన్ని విధాల 5 వేల కోట్ల వరకు నష్టపోయారు.
ముదివర్తిపాళెం- నిడుముసలి రోడ్డు తెగి13 ఇళ్లు కొట్టుకు పోయాయి..వారం రోజులైనా ఆ గండి పూడ్చి యథాస్థితికి తీసుకురాలేరా
సర్వం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం రూ.2000 ఇస్తామని ప్రకటించి వారికి ముష్టి వేస్తారా.
ఓటు వేసి గెలిపిస్తే అంతా మీ ఇష్టమా.
కమీషన్లు వస్తాయనుకున్న పనులను మాత్రమే మినిస్టర్లు చేస్తారా
75 టీఎంసీల సోమశిల డ్యాం అంటే ఆషామాషీగా ఉందా. జిల్లా కొట్టుకు పోవాలని కోరుకుంటున్నారు.
గతంలో దెబ్బతిన్న ఆఫ్రాన్ మరమ్మతులకు రూ.115 కోట్లు అనుమతులు ఇచ్చేందుకు దిక్కులేదు.
జనం ప్రాణాలు తీసే హక్కు ప్రభుత్వాలకు ఎవరిచ్చారు.ఇప్పటికైనా టెండర్లు పిలిచి పనులు చేపట్టండి.
ప్రజల ప్రాణాల కంటే రెండు వేల కోట్లు ఎక్కువ కాదు...వెంటనే పొర్లు కట్టల మరమ్మతులకు టెండర్లు పిలవండి.
ఇసుక వ్యాపారం కోసం పొర్లు కట్లల జోలికి వెళ్తే ఉరి తీయండి.
ఇప్పటికైనా కట్టలు మరమ్మతులు చేసి మనుషులను బ్రతికించండి... ప్రజలను యధాతథంగా బ్రతకనియండి
ఇల్లు మునిగితే కడపలో రఝ.5800 నెల్లూరులో రూ.2000 అందిస్తారా..ఇదెక్కడి న్యాయం
కడప జిల్లాలో పరిస్థితులు చూసి చలించిన చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మరణించిన కుటుంబానికి లక్ష రూపాయలు, నష్టపోయిన వారికి రూ.5000 ప్రకటించారు
ప్రభుత్వం రూ.2000 అని ప్రకటిస్తారా... ఎవరి అబ్బ సొత్తు అని.
కడప జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలోని బాధితులకు ఇంకా ఎక్కువ నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాం.
తెలుగుదేశం పార్టీ హయాంలో వరదలు, వర్షాలు వస్తే తక్షణం స్పందించి రాకపోకలు లేని గ్రామాల్లో సైతం ప్రజలకు హెలికాప్టర్లు ద్వారా ఆహారం,మంచినీరు అందించాం.
ప్రస్తుతం వరద బాధితులకు కనీసం మంచినీరు అందించే దిక్కు లేకుండా పోయింది.
కడప జిల్లా రాజంపేట మండలం లో పర్యటించిన మాకు... తీవ్రంగా నష్టపోవడంతో పాటు ఆ ప్రాంతంలో ఆరు రోజులుగా కనీసం మంచి నీరు ,ఆహారం లేక అలమటిస్తున్నామని స్థానిక ఆడ బిడ్డలు తెలిపారు.
గ్రేట్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో 31 మంది చనిపోతే దిక్కు లేకుండా పోయింది.
టిడిపి హయాంలో వచ్చిన తితిలీ తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో 24 గంటల్లో వందల జనరేటర్లు ఏర్పాటు చేసి విద్యుత్ ను పునరుద్ధరించడమే కాక బాధితులకు అవసరమైన ఆహారం ,మంచినీరు అందించాం.
నేడు తీవ్ర వర్షాలు, వరదలతో కడప, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమైన పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.
ఆరు రోజులు అయినప్పటికీ బాధితులకు ప్రభుత్వం నుంచి ఆపన్నహస్తం అందించే దిక్కు లేకుండా పోయింది.
అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా పరిపాలన సాగుతోందా...?
వైసీపీ ప్రభుత్వానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే అర్థం తెలుసా...?
పూర్వం నదీ పరివాహక గ్రామాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పొర్లు కట్టలు నిర్మించారు.
నేను మంత్రిగా పని చేసిన 1998 సంవత్సరంలో ఇందుకూరుపేట మండలంలో పొర్లు కట్టలు మరమ్మతులు చేపట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశా. నేటికీ ప్రజలు ఆ విషయాన్ని మర్చిపోరు.
టిడిపి హయాంలో ఉచితంగా ప్రజలకు ఇసుకను అందిస్తే వైసీపీ ప్రభుత్వం ఏజెన్సీలకు కట్టబెట్టి విధ్వంసం సృష్టిస్తోంది.
ఇసుకను జేపీ ఏజెన్సీ అప్పజెప్పడంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని పొర్లు కట్టలు విధ్వంసం అయ్యాయి.
గడిచిన రెండున్నరేళ్లలో ప్రజలను అన్ని విధాలా ఇబ్బంది పెట్టే హక్కు వైసీపీ ప్రభుత్వానికి ఎవరిచ్చారు.
ఇసుక,మద్యం ద్వారా నెలకు వేల కోట్లు కలెక్ట్ చేసేందుకు ప్రజల ప్రాణాలు తాకట్టుపెడుతారా.
ఇక్కడ ప్రజలు ఏట్లో కొట్టుకోవాలా... అక్కడ చీప్ లిక్కర్ తాగి అనారోగ్యంతో ప్రాణాలు వదలాలా