మాస్క్ లేకుంటే .1000జరినామా * నగర కమిషనర్ చల్లా ఓబులేసు
June 19, 2020
chittoor
,
commissioner
,
fine
,
karona
,
mask
,
obulesu
మాస్క్ లేకుంటే .1000జరినామా
* నగర కమిషనర్ చల్లా ఓబులేసు
చిత్తూరు : చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో మాస్కులు లేకుండా సంచరిస్తే రూ.1000 జరిమానా విధించడం జరుగుతుందని నగర కమిషనర్ చల్లా ఓబులేసు స్పష్టం చేశారు. ఈ విషయంపై నగర ప్రజలకు వాలంటీర్ల ద్వారా విస్తృతమైన అవగాహన కల్పించాలని, ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితుల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, లేనియెడల జరిమానా విధించడం జరుగుతుందనే ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని వార్డు కార్యదర్శులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం నగర కమిషనర్ వార్డు సచివాలయ కార్యదర్శులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ .. నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మాస్కు తప్పని సరిగా ధరించడం, భౌతిక దూరం, శానిటైజర్ వినియోగంపై ఈ రోజు నుంచే వాలంటీర్లు ప్రతి ఇంటికి తిరిగి వివరించాలన్నారు.
* నగర కమిషనర్ చల్లా ఓబులేసు