కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బారా షహీద్ దర్గాలోనే సాంప్రదాయ పద్ధతులను అనుసరించి ఉత్సవాలు జరుగుతాయని జిల్లా సంయుక్త కలెక్టర్  హరెందిర ప్రసాద్ పేర్కొన్నారు.  మంగళవారం మధ్యాహ్నం  కలెక్టరేట్లోని   చాంబర్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం కూడా కోవిడ్ నేపథ్యంలో ఊరేగింపు లేకుండా బారాషహీద్  దర్గాలోనే  ఉత్సవాలు నిర్వహించడం జరిగిందన్నారు.  ప్రస్తుతం జిల్లాలో కోవిడ్ మహమ్మారి ఇంకా నెలకొని ఉన్నందున జన సమూహం లేకుండా దర్గాలోనే దర్గా సాంప్రదాయ పద్ధతులను అనుసరించి 20 మంది మత పెద్దలతోనే ప్రార్థనలు, గంధం , ఉరుసు ఉత్సవాలు జరుగుతాయన్నారు.  కరోనా పాజిటివ్ కేసులు ఉన్నందున ఎటువంటి ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయకూడదని,  టెండర్లు ఏమీ ఉండవని స్పష్టం చేశారు.   ఇతర రాష్ట్రాలు,  ప్రాంతాలనుండి ఎవరు కూడా పెద్ద ఎత్తున  జిల్లాకు తరలి రాకుండా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.  జిల్లాలో ఎడగారు కాలంలో లక్షా ఇరవై వేల ఎకరాల్లో వరి పంట  సాగుచేశారని,  దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్నారు.