యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన కార్యక్రమం.

మర్రిపాడు మండల కేంద్రంలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు అనంతరం మండల అభివృద్ధి అధికారి వారికి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ జి. సుబ్బరాయుడు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు,పిఆర్సి అమలు,నూతన జాతీయ విద్యా విధానం పై పునః సమీక్ష,ఉద్యోగుల బదిలీలు,కరువు భత్యం బకాయిల మంజూరు తదితర సమస్యలపై యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,ప్రభుత్వం వెంటనే వీటిపై చర్చించి ఉద్యోగుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు నాయబ్,మోహన్ ప్రసాద్,నరసింహ నాయుడు, రాజేంద్ర కుమార్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఇనాయత్ కరిముల్లా, ప్రసాద్,ఖాజా రసూల్,జానీ తదితరులు పాల్గొన్నారు.