చెన్నూరు లో పనబాక లక్ష్మి రోడ్ షో కు భారీగా ప్రజల నీరాజనం
🟢 ఒక్క అవకాశం ఇవ్వండి
🟡 జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలం
🟢 పనబాక లక్ష్మీ వెల్లడి
:తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పనబాక లక్ష్మి శనివారం గూడూరు రూరల్ మండలం చెన్నూరు లో భారీ రోడ్ షో నిర్వహించారు . ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పనబాక లక్ష్మి తో పాటుగా గూడూరు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ , మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి , గూడూరు ఇంచార్జ్ , మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ , తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి , చెన్నూరు ఇంచార్జ్ షేక్ కరీముల్లా , తిరుపతి పార్లమెంటు తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీమతి మట్టం. శ్రావణి రెడ్డి , గూడూరు పట్టణ ఇన్చార్జ్ , బీసీ సెల్ నాయకులు మహేష్ , తదితరులు పాల్గొన్నారు.
ఈ రోడ్ షో లో వందల సంఖ్యలో మహిళలు , యువకులు , తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వెంట నడుస్తూ పనబాక లక్ష్మి కి మద్దతుగా పలికారు . అనేక చోట్ల మహిళలు మంగళ హారతులు పట్టారు . చెన్నూరు చరిత్రలో లో మొదటిసారి ఈ విధంగా వేలాది మంది ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆనందం పొంగింది .
రోడ్ షోలో చెన్నూరు గ్రామం లోని కాపు వీధి ,కోటవీధి, బజార్ వీధి ,గాంధీ బొమ్మ వీధి, సారాయి వీధి ,ఎరుకల కాలనీ, అరుంధతీవాడ, ఎస్సీ కాలనీ, బి.సి.కాలనీ ,గమళ్ల పాలెం, తూర్పు వీధి ,హరిజనవాడ - 1 , హరిజనవాడ - 2 , హరిజనవాడ - 3 వరకు కోలాహలంగా సాగింది .
మెయిన్ బజార్ లో జరిగిన రోడ్ షో కార్యక్రమంలో పనబాక లక్ష్మి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని , ధరలు ఆకాశాన్నంటాయని అన్నారు . ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు , మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వం కళ్ళు నెత్తికెక్కి ప్రజలను పట్టించుకోవడం లేదని అన్నారు.
గూడూరు ఇంచార్జ్ , మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ.... తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలతో చేసి గూడూరు ప్రాంతం అభివృద్ధి చేశానని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని అన్నారు . అందుకే పనబాక లక్ష్మి కి గెలిపించి జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు.
*తెలుగుదేశం పార్టీరాష్ట్ర కార్యదర్శి ,చెన్నూరు ఇంచార్జ్ షేక్.కరీముల్లామాట్లాడుతూ..రాష్ట్రంలో పరిపాలనా పరంగాఅన్ని రంగాల్లో విఫలమైన జగన్ కు ప్రజలకు ఓటు అడిగే హక్కు లేదని అన్నారు,చెన్నూరు గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డ అని అన్నప్పుడు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది . పనబాక లక్ష్మి ని గెలిపించి తెలుగుదేశం పార్టీ నాలుగో సింహాన్ని పార్లమెంటు కు పంపించాలని కోరారు .
తిరుపతి పార్లమెంటు తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి మాట్లాడుతూ. .. చెన్నూరు గ్రామం లో తాను ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించానని , చెన్నూరు ప్రజలు పనబాక లక్ష్మి గారికి ఓటేసి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పరసా వెంకటరత్నం , ఇందుకూరి లక్ష్మణ్ రెడ్డి , గూడూరు మండల పార్టీ అధ్యక్షుడు కె . వి . రాజు , భాస్కర్ రెడ్డి , ప్రసాద్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు కటికాల శ్రీనివాసులు , మట్టం. మురళి , కల్లూరి రవి , సురేష్ , అనిల్ , షేక్ సల్మాన్ , గోవిందమ్మ , మాధవి , హైమావతి, శైలజ, శ్యామల , పులి . రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.