కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి పై టిడిపి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు పంచ్ లు.... ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న
నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ఆత్మకూరు నియోజకవర్గ నాయకులు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు....
నియోజకవర్గ నాయకులతో మండలాల వారీగా అబ్దుల్ అజీజ్ సుదీర్ఘంగా చర్చించారు.
కార్యకర్తలకు , నేతలకు ఎప్పుడు అండగా ఉంటామని అధికార పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు..
ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగిన సహించేది లేదని.. అధికార పార్టీ దౌర్జన్యాలు ,ఆగడాలను ఎంత మాత్రం సహించమన్నారు..
రోడ్ల పేరిట 20 వేల కోట్లు నిధులు బడ్జెట్ లో పెట్టీ, 200 కోట్లు కూడా రోడ్ల కోసం ఖర్చు పెట్టని ఘనత జగన్ మోహన్ రెడ్డిది - అబ్దుల్ అజీజ్
రాష్ట్ర వ్యాప్తంగా 95% శాతం పూర్తి రోడ్ లు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ది - అబ్దుల్ అజీజ్
చిన్నపాటి వాహనాల కోసం వేసిన రోడ్ ల పై భారీ భారీ వాహనాల తో ఇసుక, మట్టి దోపిడీ చేసి ఈ రోడ్ లను గుంతల మయం చేశారు - అబ్దుల్ అజీజ్
రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ లు గుంతల మయం అవ్వడంతో, ప్రజలకు ఇబ్బంది కరంగా మారడం తో టీడీపీ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి అధ్యక్షతన 7 నియోజకవర్గాల నాయకులతో, రాష్ట్ర మరియు జిల్లా స్థాయి నాయకులతో రూరల్ మండలం లో గల సజ్జాపురం రోడ్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు...
ఈ సంద్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ...
రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ లు అన్ని ధ్వంసం అయ్యాయని, ముఖ్యంగా నెల్లూరు లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా ఆగడాలతో రోడ్ లు దారుణంగా తయారయ్యాయని అన్నారు...
ఈ రోడ్ ల మీద ప్రయాణం చేస్తూ, మాతో పాటు ఇక్కడ ఉన్న నాయకులకు ఇద్దరికి గాయాలయ్యాయని, అంతే కాక కుటుంబ సమేతంగా వెళ్తూ ఈ రోడ్ ల పై గాయాల పాలైన సంఘటనలు కూడా చాలా ఉన్నాయని అన్నారు...
మేము ఇక్కడికి వస్తునామన్న సమాచారంతో, రాత్రి కి రాత్రి ఎర్ర మట్టి తోలారని, తోలిన వారు వాటిని సద్రం కూడా చేయలేదని ఎందుకంటే అది కూడా బెదిరించి వేయించి ఉంటారని అన్నారు..
ఇక్కడ రాత్రి పూట లైట్లు కూడా ఉండవని, గుంతలు కనిపించక ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు...
వర్షా కాలం వచ్చేటప్పుడు, పార్ట్ హోల్స్ చేయడం నిరంతర ప్రక్రియ అని, పార్ట్ హోల్స్ అంటే ఎక్కడన్నా చిన్న చిన్న గుంతలు ఉంటే వాటికి మరమ్మతులు చేస్తే, రోడ్ లు ధ్వంసం అవ్వకుండా ఉంటాయని అన్నారు...
టీడీపీ హయాంలో దాదాపు 25 వేల కిలోమీటర్ల మేర రోడ్ లు చరిత్ర సృష్టించామని, ఇంకా చాలా వరకు గ్రాంట్ లు చేశామని, అలా గ్రాంట్ చేసిన రోడ్ లు వేసే దిక్కు లేదు..
పార్ట్ హోల్స్ చేయడానికి కూడా ఏ కాంట్రాక్టర్ ముందుకు రాని పరిస్థితి ఈ ప్రభుత్వం లో ఉంది, అభివృధి చేయాల్సిన నిధులు కూడా దారి మల్లు తుండడంతో కాంట్రాక్టర్ లు కూడా ముందుకు రాని పరిస్థితి అన్నారు...
గతం లో రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రతిపక్షం లో ఉన్నప్పుడు చిన్న గుంత లో దిగి డ్రామాలు చేశారని, ఇప్పుడు ఈ గుంతలో వచ్చి ఈత కొట్టండి మీ ముఖ్యమంత్రి రోడ్డు వేస్తారేమో చూద్దాం అని అన్నారు..
త్వరితగతిన ఈ రోడ్లన్నీ మరమ్మతులు చేసి, తక్షణమే టిడిపి హయాంలో గ్రాంట్ లు చేసిన రోడ్లను వేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేశారు...
ఈ సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గ ఇంఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ
రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వంలో అధ్వానంగా మారిన రోడ్లను సందర్శించామని అన్నారు..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిమ్మిక్కులు చేసిన శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి ఈ గుంతల్లో జిమ్మిక్కులు చేయండి అని అన్నారు...
ఇప్పుడున్న ప్రభుత్వంలో మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రతి ఒక్కరూ వివిధ రకాల దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు..
రాజకీయాల్లోకి వచ్చి డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క అబ్దుల్ అజీజ్ మాత్రమే అని అన్నారు...
రాబోవు రోజుల్లో టిడిపి అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వంలో పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు...
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య మాట్లాడుతూ...
నెల్లూరు రూరల్ నియోజకవర్గ రోడ్డు మొత్తం అస్తవ్యస్తంగా మారాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు...
నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రోడ్ల పర్యవేక్షణ చేశామని అన్నారు....
తక్షణమే ఈ రోడ్లన్నీ మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేశారు...
పై కార్యక్రమం లో సంపత్ యాదవ్, చెముకుల కృష్ణ చైతన్య, జాకీర్, గంగాధర్, జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, భులక్ష్మీ, ప్రభాకర్ రెడ్డి, మళ్ళీ నిర్మల, ప్రణయ్ రెడ్డి, దయాకర్ గౌడ్, రేవతి, రోజా రాణి, చెన్నా రెడ్డి శ్రీకాంత్ రెడ్డి,నన్నే సాహెబ్, సుబహాన్, స్థానిక నాయకులు, గోపలయ్య, సుధీర్ నాయుడు,ఆదిత్య రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, ఎర్రన్న, విజయ్, సింహాద్రి, మహేష్ నాయుడు, పెంచలయ్య, మురళి, మహేష్, సుశీలమ్మ, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు..
నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో
నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ....
👉
👉 ప్రభుత్వం చేసిన తప్పిదాలకు అధికారులను నిందించడం ఎంతవరకు సబబు అని అబ్దుల్ అజీజ్ గారు నిలదీశారు...
👉గత 10 రోజుల క్రితం ప్రభుత్వ ఆస్పత్రిలో కరెంట్ లేక పదమూడు మంది మృతి చెందితే శ్రీధర్ రెడ్డి నిద్రపోతున్నారని అబ్దుల్ అజీజ్ గారు విమర్శించారు...
👉మేము ప్రభుత్వ ఆసుపత్రి లో రివ్యూ చేసి ఎన్‌ఏబిహెచ్ రిపోర్ట్ అడిగి తీసుకుంటే దానిలో 202 లోపాలు ఉన్నాయి ఆ విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేసిన మీరు ఎందుకు స్పందించలేదు ఎమెల్యే గారు అని అబ్దుల్ అజీజ్ నిలదీశారు...
👉జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నటి నుండి ప్రతి దానిలో గోల్మాల్ జరుగుతుందని అబ్దుల్ అజీజ్ తెలిపారు...
👉కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ తో తను మాట్లాడనని వారు ఇప్పటికే సిఎఫ్‌ఎంఎస్ లో చేర్చమని,సోమవారం దాకా జీతాలు వస్తాయని తెలిపారా
ని అబ్దుల్ అజీజ్ తెలిపారు...
👉రేపు సోమవారం వారికి జీతాలు వస్తాయని తెలుసుకొనే శ్రీధర్ రెడ్డి డ్రామా చేస్తున్నారని అబ్దుల్ అజీజ్ తెలిపారు...
👉అధికారంలో మీరు ఉన్నది ఏడ్చే వారి పక్కన కూర్చొని ఏడవడానికి కాదు వీలైతే జగన్ మోహన్ రెడ్డి ఇంటి ముందు కూర్చోవాలని అబ్దుల్ అజీజ్ గారు తెలిపారు...
👉వీళ్ళ లోపాయకారి ఒప్పందాలకు తల ఓపలేదనే నెపంతోనే అధికారులపై బురద జల్లుతున్నారు అని అబ్దుల్ అజీజ్ గారు తెలిపారు...
👉శ్రీధర్ రెడ్డి గారు మైక్ పట్టుకుంటే సమస్యలు పరిష్కారమయ్యే పనైతే మిగితా సమస్యలపై ఎందుకు స్పందించటం లేదని అబ్దుల్ అజీజ్ గారు తెలిపారు...
👉ఇంకా మీ పాత కాలపు డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్తితిలో లేరు రెడ్డి గారు అని అబ్దుల్ అజీజ్ గారు తెలిపారు...
పై సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య,నగర తెదేపా అధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు,ఖాజావలి,టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుడు ప్రణయ్ రెడ్డి,పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షురాలు పనబాక భులక్ష్మీ,నగర మహిళ అధ్యక్షురాలు రేవతి,రోజారాణి, రురల్ మండల తెదేపా అధ్యక్షులు పమజుల ప్రదీప్,జలదంకి సుధాకర్,సాబీర్ ఖాన్,ఎంఎస్ రెడ్డి,శ్రీనివాసులు,వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు నగర నియోజకవర్గ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు హాజరయ్యారు....
ఈ సందర్బంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ....
అమరావతి రైతులకు వైసీపీ మినహాయించి అన్నీ పార్టీ లు మద్దతు తెలుపుతున్నాయాని, అందులో భాగంగా టీడీపీ కూడా రైతులకు మద్దతుగా, నిరసన చేస్తున్నాం అని అన్నారు...
వారికి సంఘీభావంగా మమ్మల్ని అమరావతి కి వెళ్లనివ్వకుండా, ప్రతీ కార్యకర్త కు నోటీసులు ఇచ్చారని అన్నారు...
గతం లో నాయకులకు మాత్రమే ఇచ్చేవారాని ఇప్పుడు ప్రతీ కార్యకర్తకు ఇచ్చారని అన్నారు...
రాజధాని రైతుల విషయం లో sc ల మీదే sc అట్రాసిటీ కేసు లు పెట్టించిన సిగ్గుమాలిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు...
తక్షణమే అమరావతి ని రాజధాని గా ప్రకటించి, రైతులకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేసారు....
ఈ సందర్బంగా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ...
రైతులను ఎంత ఇబ్బంది లు పెడుతున్న, వారి బిడ్డలను కొడుతున్న, వారి ని కొడుతున్నా సరే పోరాటం ఆపకుండా రైతుల కోసం పోరాడుతున్నారని అన్నారు...
రాజధాని విషయం లోనే కాదు, ప్రతీ విషయం లోను జగన్ మోహన్ రెడ్డి మాట తిప్పుతున్నారని అన్నారు...
ఎవరైనా రాజధాని కి వెళ్తే అన్నీ పనులు ఒకే చోట అయిపోవాలని అన్నారు..
వారికి సంఘీభావంగా అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వం లో నిరసన చేసిన తెలుగు మహిళలకు అభినందనలు తెలియచేసారు....
ఈ సందర్బంగా నెల్లూరు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి మాట్లాడుతూ....
మహిళల పైన రైతుల దాడులు చేస్తున్న సరే, 365 రోజులు అమరావతి రాజధాని కోసం పోరాడినారు..
మహిళల పైన లాటి ఛార్జ్ చేయించి, అంతే కాకుండా కుక్కలతో పోల్చడం దుర్మార్గం అని అన్నారు...
ఈ సందర్బంగా నగర మహిళా అధ్యక్షురాలు రేవతి మాట్లాడుతూ....
మూడు రాజధానులు పెడితే మహిళలకు ఇబ్బందిగా ఉంటుందని మహిళలు అంత దూరం ప్రయాణించ లేరని అన్నారు....
ఒక ఇంట్లో మహిళ ఏడిస్తే ఇంటికి మంచిది కాదని అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంది మహిళలు ఉసురు పోసుకుంటున్నారని ఆయనకు పుట్టగతులు ఉండవు అని అన్నారు...
ఈ కార్యక్రమం లో మంగమ్మ ప్రమీల, బాణా, పద్మా, వెంకట లక్ష్మి, రమణమ్మ, వసంత, సురేఖ, వెంకట లక్ష్మి, బుజ్జమ్మ, రాజ్యలక్ష్మి, లక్ష్మి, పార్వతి, ప్రభావతి, ప్రవీణ, విజయ, ధనమ్మనెల్లూరు రూరల్ మండల అధ్యక్షులు పముజుల ప్రదీప్, జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, నాగేంద్ర, సారంగి గున్నయ్య, నన్నెసాహెబ్, జాకీర్, రంగా, గిరిధర్, రవి, వెంకటేశ్వర్ల పాల్గొన్నారు....