తిరుపతి ఎన్నికల్లో తెగించి పోరాడదాం!-మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మీ
🌟 రేపు 24న పనబాక లక్ష్మి నామినేషన్
🌟 నెల్లూరు కలెక్టరేట్ లో ఉదయం 10 గం" లకు నామినేషన్
🌟 24 న ఉదయం 9 గం" లకు వి ఆర్ సి సెంటర్ వద్ద అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ ర్యాలీ తో కలెక్టరేట్ లో నామినేషన్
🌟అధికార పార్టీ అక్రమాలకు ఎదురొడ్డడమే ఏకైక మార్గం
🌟మొహమాటాలు ఇక చెల్లవు నేతలకు,కార్యకర్తలకు దిశానిర్దేశం
🌟అంతా బాగుందని చెప్పడం కాదు క్షేత్రస్థాయిలో ఫలితాలు చూపించాలి
🌟అలాంటివారికే పార్టీలో పెద్దపీట
🌟 టీడీపీ నాయకులు, కార్యకర్తలకు తిరుపతి ఉప ఎన్నిక పరివేక్షణ కమిటీ స్పష్టీకరణ
🌟ప్రతి అసెంబ్లీ సెగ్మెంటుకు 25 క్లస్టర్లు
🌟ఒక్కో క్లస్టర్‌కు ఒక ఇన్‌చార్జి
🌟ఒక్కో మాజీ మంత్రికి ఒక్కో సెగ్మెంటు
🌟24న పనబాక లక్ష్మి నామినేషన్‌కు భారీ స్థాయిలో జనసమూహం
🌟రోజుకో అంశంపై గడప గడపకూ ప్రచారం
🌟ఐదుగురు నేతలతో సమన్వయ కమిటీ
🌟విధేయతలు, మొహమాటాలు ఇకపై చెల్లవు .
🌟 సమావేశాలకు వచ్చి అంతా బాగుందని చెప్పడం కాదు.
🌟క్షేత్రస్థాయిలో ఫలితాలు చూపించాలి
🌟అలాంటివారికే పార్టీలో పెద్దపీట వేస్తాం
🌟తిరుపతి ఉప ఎన్నిక పరివేక్షణ కమిటీ
అధికార పార్టీ అక్రమాలు, బెదిరింపులు, ధనప్రవాహానికి ఎదురొడ్డి.. తెగించి పోరాడడమే మార్గమనిమాజీకేంద్రమంత్రి ,టీడీపీ తిరుపతి ఎంపీ అభ్యర్ధిని పనబాక లక్ష్మీ స్పష్టం చేశారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల నామినేషన్ పక్రియ మంగళవారం ప్రారంభం కావడంతో రాజకీయాలు హిట్ ఎక్కిన నేపథ్యంలో పనబాక లక్ష్మీ మంగళవారం తిరుపతి లో జరిగిన టిడిపి కార్యకర్తల సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెగించి పోరాడేవాళ్లకే పార్టీలో గుర్తింపు.. భవిష్యత్తులో అవకాశాలు లభిస్తాయన్నారు. తిరుపతి ఉప ఎన్నికపై ఆమె తిరుపతి పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు, యనమల రామకృష్ణుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్, ఎమ్మెల్యే పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన నేతలు, పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి తదితరులు హాజరయ్యారు.ఈ నెల 20 నుండిఅసెంబ్లీనియోజకవర్గాల వారీగా చర్చలు జరిగాయి
ఇటీవలి ఎన్నికల్లో కూడా వ్యక్తిగతంగా బలంగా పోరాడిన చోట్ల అనుకూల ఫలితాలు వచ్చాయన్నారు. 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీ స్థానంలోని అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చిన ఓట్లకంటే ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి వచ్చిన ఓట్లు ఎక్కువని చెప్పారు. లక్ష్మిని ఆమె జన్మదినం రోజున అభ్యర్థిగా ప్రకటించామని, ఆమె పారీ ్టకోసం అంకితభావంతో కష్టపడుతున్నారని టీడీపీ నేతలు పేర్కొన్నారు.
మరోవైపు తిరుపతి ఉప ఎన్నిక కోసం పైస్థాయిలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన అధినేత చంద్రబాబు నాయుడు ఇందులో అచ్చెన్నాయుడు, లోకేశ్, సోమిరెడ్డి, రవిచంద్రయాదవ్, పనబాక కృష్ణయ్య సభ్యులుగా నియమించి కేడర్ ను ఉత్తేజ పరిచారు అన్నారు.
పార్లమెంటరీ ఇన్‌చార్జి నరసింహయాదవ్ కూడా వీరితో కలిసి పనిచేస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని 25 క్లస్టర్లుగా విభజించి ఒక్కోదానికి ఒక రాష్ట్ర నాయకుడిని ఇన్‌చార్జిగా నియమిస్తారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంటుకు ఒక్కో మాజీ మంత్రిని ఇన్‌చార్జిగా చంద్రబాబు నియమించారు.
కార్యకర్తలతో సమావేశాలు పూర్తి
పనబాక లక్ష్మి 20 నుంచి పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దిగారు. 20 నుంచి 23వ తేదీ వరకు ఒక్కో రోజు కొన్ని అసెంబ్లీ స్థానాల్లోని కార్యకర్తలతో భేటీ అయ్యారు. నాలుగురోజుల పాటు ఇలా కార్యకర్తలందరితో సమావేశమై అందరితో మమేకమై పార్టీ కేడర్ లో జోష్ పెంచారు.. 24న నామినేషన్ దాఖలు చేస్తారు. ఆమె తన నామినేషన్‌ను నెల్లూరు కలెక్టరేట్‌లో వేస్తారు.
నామినేషన్ అనంతరం వరుసగా 10రోజుల పాటు రోజుకో అంశంపై గడప గడపకూ ప్రచారం చేయాలని అధిష్టానం నిర్ణయించింది. ఇసుక కొరత, మద్యం విధానంలో లోపాలు, అరాచకాలు-దాడులు, అవినీతి.. తదితర అంశాలపై ప్రచారం నిర్వహిస్తారు.
క్లస్టర్ల ఇన్‌చార్జులుగా వెళ్లే నాయకులు తమ వెంట కార్యకర్తలను కూడా తీసుకెళ్లాలన్నారు. పార్లమెంటు పరిధిలోకి వచ్చే నెల్లూరు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లకు కలిపి నెల్లూరు జిల్లాలో ఒక కార్యాలయం, చిత్తూరు జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి తిరుపతిలో ఒక కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు.
సమావేశాల్లో సోమిరెడ్డి ప్రత్యేక ఆకర్షణ- వైసీపీ పైఘాటు ఘాటు వ్యాఖ్యలు
తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కార్యకర్తలు,నాయకులకు హిత బోధ చేశారు,క్లస్టర్ల ఇన్‌చార్జులు వారి ప్రాంతాల్లోని 25 బూత్‌లకు చెందిన కమిటీలను చైతన్యవంతం చేసి సమన్వయం చేయాలని చెప్పారు. గ్రామస్థాయి పార్టీ కేడర్‌ను క్రియాశీలం చేసి తగిన దిశానిర్దేశం చేయాలని నిర్దేశించారు. జైల్లో పెట్టినా అందుకు సిద్ధమే.. తెగించి పోరాడతాం అని సోమిరెడ్డి సందర్భంగా అన్నారు.
గూడూరు పరిధిలోని A5 లో జరిగిన గూడూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో సోమిరెడ్డి పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు, ఈ మధ్య పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని వారం రోజులు జైల్లో పెట్టారు. ఆయనతో మాట్లాడాను. జైల్లో అటాచ్డ్ బాత్‌రూం ఉందా అని అడిగాను. ఉందన్నారు. ఇక ఇబ్బంది లేదు. జైల్లో పెట్టినా వెనకాడేది లేదు. తెగించి పోరాటం చేస్తా అని అన్నట్లు సమాచారం.
మీ కొడలకు ఒక్క అవకాశం ఇవ్వండి- పనబాక
తిరుపతి సభలో పనబాక లక్ష్మి మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి, అంకితభావంతో పనిచేస్తానన్నారు. ప్రతి రోజూ ప్రజలను కలుస్తానని చెప్పారు.రేపు జరిగే నామినేషన్ కార్యక్రమానికి భారీగా టీడీపి నాయకులు,కార్యకర్తలు తరలి రావాలి అనీ పిలుపునిచ్చారు, మీ కోడలు,మీ బిడ్డకు తిరుపతి ఎంపీ గా ఒక్క అవకాశం ఇవ్వాలని పనబాక లక్ష్మీ కోరారు.