తిరుపతి ఉప ఎన్నికలు గూడూరు సెగ్మెంట్ లోని నోడల్ ఆఫీసర్స్ అందరికి సబ్ కలెక్టర్  గోపాకృష్ణ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగినది. 

ఈ కార్యక్రమం లో గూడూరు DSP పోలీస్ సిబ్బంది, నోడల్ ఆఫీసర్స్  హాజరయ్యారు.
ఎన్నికల నిర్వహణ పై సబ్ కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగినది.
మీడియా సమావేశం లో తెలియజేసిన విషయాలు
డివిజన్ పరిధిలో సింగిల్ విండో సిస్టం ను సబ్ కలెక్టర్ ఆఫీస్ గూడూరు లో ప్రారంభించారు. సభలు, సమావేశాలు మరియు వాహనాల అనుమతి కొరకు సింగిల్ విండో సిస్టం ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు.
స్వేచ్ఛయుతమైన,ప్రశాంతమైన వాతావరణం లో ఎన్నికల నిర్వహణ కొరకు ఏర్పాట్లు జరుగుచున్నవి.
కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ సిబ్బందికి   వ్యాక్సిన్ ఇప్పించడం జరుగుతున్నది.
ఎలక్షన్ కమిషన్ తాజా సమాచారం మేరకు ఇనిడిబుల్ ink ఎడమచేతి యొక్క మధ్య వేలుకు వేయబడును. ఎంపీటీసీ/జడ్పీటీసీ ఎన్నికలో పాల్గొన్న వారిని తరువాత వేలుకు(మూడవ) కు వేయబడును.
సి-విజిల్ ఆప్ ద్వారా పౌరులు ఎవరైనా ఆడియో, వీడియో మరియు ఫోటోలు ద్వారా MCC వైలేషన్ పై ఫిర్యాదు చేయవచ్చు.
12 వ తేదీ నుండి ఓటర్స్ స్లిప్స్అందుబాటులో  ఉంటాయి .
గుర్తింపు పొందిన పొలిటికల్ పార్టీలు ఓటర్స్ జాబితా ను ఉచితం గా  తీసుకోవచ్చు.
ఓటర్స్ అవగాహన కొరకు స్వీప్ కార్యక్రమంను నిర్వహిస్తున్నారు.
ఎంపీటీసీ/జడ్పీటీస్ ఎన్నికల కొరకు ఎంపీడీఓ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఎన్నికలు జరిపేందుకు అధికారులు అందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేసారు.