మలమూత్ర విసర్జన ద్వారా కరోనా వ్యాప్తిఒకపక్క కరోనా వైరస్ తో ఎనిమిది నెలల నుంచి ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వింటూనే ఉన్నా దానికి సంబంధించి పరిశోధనలో ఏదో ఒక సంచలన విషయం వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్ లో మురుగు నీటిలో కరోనా వైరస్ పై జరిగిన పరిశోధనలో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మురుగు నీటిని శుభ్ర పరిచే కేంద్రాల నుంచి నమూనాలను సేకరించి చూడగా మురుగు నీటి లో కరోనా వైరస్ లు ఉన్నాయని సిసిఎంబి డైరెక్టర్ రాకేశ్ మిశ్రా మీడియాకు వెల్లడించారు.సి సి ఎం బి, ఐ ఐ సి టి సంయుక్తంగా దీనిపై పరిశోధనలు చేశాయని ఆయన వెల్లడించారు. ముక్కు నోటి ద్వారానే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారా కూడా వ్యాపిస్తుందని ఆయన కాసేపటి క్రితం మీడియాకు వెల్లడించారు.
వ్యాధి సోకిన 35 రోజుల తర్వాత కరోనా వైరస్ బయటకు వస్తుందని చెప్పారు.