నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతో పాటు కరోనా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ పిలుపునిచ్చారు. కరోన సెకండ్ వేవ్ ఉదృతంగా వ్యాపిస్తుండడంతో నెల్లూరు నగరంలోని ఆర్టీసీ వద్ద అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వయంగా జిల్లా ఎస్పీ వాహనదారులకు మాస్కులు తొడిగారు. ఇంట్లో నుండి బయటికి వచ్చేటప్పుడు కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు
గూడూరు టవర్ క్లాక్ సెంటర్ లో
👉కరోనా వైరస్ సెకండ్ వేవ్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి..గూడూరు DSP ఎం. రాజగోపాల్ రెడ్డి
👉కోవిడ్ నిబంధనలు పాటించండి లేకుంటే చలానాలు తప్పవు..గూడూరు పట్టణ సిఐ.దశరథ రామారావు
ఈరోజు సాయంత్రం గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్లో కోవిడ్ వైరస్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన గూడూరు పట్టణ పోలీసులు.... ప్రజలు లు కోవిడ్ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పబ్లిక్ లో తిరిగేటప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని,అలాగే వ్యక్తిగత దూరం కూడా పాటించాలని, అనవసరంగా గుంపులుగా తిరగవద్దని కోవిడ్ నిబంధనలు పాటించడం వలన కొంతమేర కోవిడ్ వైరస్ ని అరికట్టే అవకాశం ఉందని లేనిచో చలానాలు కూడా తప్పవని ప్రజలందరూ కోవిడ్ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండి కోవిడ్ వైరస్ వ్యాప్తి నిరోధానికి కృషి చేయాలని గూడూరు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి కోరారు, ఈ అవగాహన కార్యక్రమంలో డిఎస్పీ ఎం. రాజగోపాల్ రెడ్డి తో పాటు గూడూరు పట్టణ సిఐ దశరథ రామారావు,1వ పట్టణ ఎస్సై బ్రహ్మనాయుడు,రోజాలత,ఇతర పోలీసు సిబ్బంది,విద్యార్థులు,కొందరు ప్రజలు పాల్గొన్నారు....
దిశ పోలీస్ స్టేషన్లో 45 పెట్రోలియం వాహనాలు, ఒక ఇంటిగ్రేటెడ్ వాహనాన్ని ప్రారంబించిన ఎస్పీ భాస్కర్ భూషణ్..
-
- పాల్గొన్న ఎఎస్పీ వెంకటరత్నం, శ్రీలక్ష్మీ, దిశ డిఎస్పీ నాగరాజు, టౌన్ డిఎస్పీ శ్రీనివాసులరెడ్డి
- మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చింది..
- ఆపదలో ఉన్న బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు పెట్రోలియం వాహనాలు ఉపయోగపడతాయి..
- దిశ పోలీస్ స్టేషన్లను ప్రారంభించినప్పటి నుంచి మహిళలపై అత్యాచారాలు తగ్గుముఖం పట్టాయి
- అత్యాచార బాధితులకు అండగా ఉంటూ.. వారికి సత్వర న్యాయం చేసేందుకు దిశ అందుబాటులో ఉంటుంది..
- డీఎస్పీ మల్లికార్జున రావు
ధనార్జనే ధ్యేయంగా ఆహార ఉత్పత్తులను కల్తీ చేస్తూ, వినియోగదారుల ఆరోగ్యాలతో చెలగాట మాడుతున్న వాణిజ్య సంస్థలపై అవగాహన పెంచుకుని
చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రజలు సహకరించాలని ట్రాఫిక్ డిఎస్పీ మల్లికార్జున రావు కోరారు.
జాతీయ వినియోగదారుల హక్కుల 35 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని
రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక నవాబుపేట లక్ష్మీపురంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో సమావేశాన్ని గురువారం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పీ హాజరై మాట్లాడారు.
ఆహార పరిరక్షణ ప్రమాణాల చట్టం ప్రకారం ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే కల్తీ ఉత్పత్తులను ఎవరైనా తయారుచేసినా,
నిల్వ ఉంచినా, మార్కెట్ లో విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
వినియోగదారులు తమ హక్కుగా భావించి ప్రభుత్వానికి సహకరించినపుడే కల్తీ ఉత్పత్తుల వినియోగానికి అడ్డుకట్ట వేయగలమని అభిప్రాయపడ్డారు.
కల్తీ ఉత్పత్తులపై సమాచారాన్ని"ఆహార భద్రత, నియంత్రణాధికారి" దృష్టికి తీసుకువస్తే వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో వినియోగదారుల హక్కుల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తిరుపాల్, కార్యదర్శి శేషయ్య,
జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రావు, సభ్యులు నాగిరెడ్డి, కల్పన, షుకుర్ బాషా, పెంచలయ్య, శివాని రెడ్డి, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
______________
జలదంకి మండలం వేములపాడు ఘర్షణ ఘటనలో పోతల రమణయ్య తీవ్రంగా గాయపడిన నేపధ్యంలో నిందితులైన 13 మందిని సోమవారం చామదల క్రాస్ వద్ద జలదంకి యస్ ఐ వెంకట్రావు అరెస్టు చేసినట్లు డి.యస్.పి ప్రసాద్, సి.ఐ అక్కేశ్వరరావు తెలిపారు.అరెస్టు అయిన వారిలో బద్దిపూడి తిరుపాలు,చేవూరి నాగార్జున, సుబ్రహ్మణ్యం, కూసుపాటి ఏసేబు,మొద్దు అంజయ్య, మొద్దు జయరామయ్య,మొద్దు లక్ష్మయ్య,మొద్దు రామయ్య,మొద్దు రామకృష్ణ,మొద్దు రాంబాబు,పోతల రవిబాబు,పోతల శ్రీ ను, పోతల వెంకటేష్ లు ఉన్నట్లు డి యస్ పి తెలిపారు. యస్ ఐ వెంకట్రావు సమయస్ఫూర్తి తో ప్రమాద తీవ్రత నెలకొందని, సి.ఐ అక్కేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రశాంత త నెలకొల్పినట్లు తెలిపారు. రమణయ్య వర్గానికి చెందిన నలుగురు ఆసుపత్రి లో ఉన్నా రని వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని డి యస్ పి ప్రసాద్ వివరించారు @ జయప్రతాప్ రెడ్డి