మహిళల రక్షణకే దిశ యాప్.. రాజుపాలెం మే 21 విశాఖ టుడే రాష్ట్రములోని మహిళలకు రక్షణ కల్పించాలని మంచి ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దిశ యాప్ ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని రాజుపాలెం ఎస్ ఐ మహమ్మద్ షఫీ పిలుపునిచ్చారు దీనిలో భాగంగా స్పెషల్ డ్రైవ్ దిశ యాప్ పై రాజుపాలెం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది సచివాలయం పోలీసులు వాలంటీర్స్ కలిసి మాచర్ల గుంటూరు రహదారిపై మహిళలకు దిశ యాప్ గురించి విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు వాహనదారులకు ప్రయాణికులకు దగ్గరుండి దిశ యాప్ ఏ విధంగా వినియోగించుకోవాల్సిన దో రాజుపాలెం పోలీసులు శనివారం ఉదయం 5 గంటల నుండి  ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ కిరణ్ కుమార్  రాంబాబు కనకరాజు పాండు సచివాలయం పోలీసులు వాలంటీర్స్ పాల్గొన్నారు.