నెల్లూరు
జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న దిశ పోలీసు స్టేషన్ కు ఐఎస్ఓ గుర్తింపు దక్కింది. సాంకేతిక పరిజ్ఞానం తోపాటు, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకు ఈ గుర్తింపు లభించింది. ఐఎస్ఓ సౌత్ ఇండియా హెడ్ ఇలియాజ్ అందజేసిన సర్టిఫికెట్‌ను డీఐజీ త్రివిక్రమ వర్మ సోమవారం విజయవాడలో ఆవిష్కరించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా నెల్లూరు జిల్లా దిశ పోలీసు కార్యాలయానికి ఈ గుర్తింపు లభించిందని డీఐజీ తెలిపారు. ఈ ఘనతకు కారణమైన జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ను అభినందించారు. ఐఎస్ఓ స్టాండర్డ్స్ ప్రకారం పోలీస్ సేవలు ఉండటం వల్లే ఈ గుర్తింపు లభించిందన్నారు. సాంకేతికంగా పోలీస్ శాఖ ముందుండటం వల్ల ట్రెడిషనల్ పోలీసింగ్ మరిచిపోతున్నామని.. జిల్లాలో ట్రెడిషనల్ పోలీసింగ్ అమలయ్యేలా చర్యలుతీసుకుంటామన్నారు. అనంతరం జిల్లా పోలీసులతో డీఐజీ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా డిఐజి త్రివిక్రమ్ వర్మమాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌లో ఆరు దిశ పోలీస్ స్టేషన్లకు లభించిన ISO* *సర్టిఫికెట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది అన్నారు.*
*దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు అని. అత్యుత్తమ నాణ్యత, ప్రమాణాలతో కూడిన సేవలకు గాను, ఏపీలోని 6 దిశ పోలీస్స్టేషన్లకు లభించిన జీటౌ 9001:2015 సర్టిఫికెట్లను సీఎం జగన్ ఆవిష్కరించారు అన్నారు,సౌత్ ఇండియా ఐఎస్ఓ జనరల్ మేనేజర్ డాక్టర్ ఎలియాజర్ సర్టిఫికెట్లు జారీని వివరించారు. విజయనగరం, రాజమండ్రి అర్బన్, విశాఖపట్నం సిటీ, నెల్లూరు, కర్నూలు, అనంతపూర్ పోలీస్స్టేషన్లకు జీటౌ 9001:2015 సర్టిఫికెట్లు లభించాయి. త్వరలో విజయవాడ సిటీ దిశ పోలీస్‌స్టేషన్‌కు కూడా సర్టిఫికెట్ రానుంది. ఈ సందర్భంగా 18 దిశ పోలీస్టేషన్ల సిబ్బందితో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అన్నారు, జిల్లాల ఎస్పీలు, ఇతర అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వారం రోజుల్లోనే 167 కేసులను డిస్పోజ్ చేసిన విషయం తెలుసుకున్న సీఎం వారిని అభినందించారు అనీ తెలిపారు, ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా ఐఎస్ఓ డాక్టర్ ఇలియాజ్,అభిలాష్ సన్నీ తదితరులు పాల్గొన్నారు,*
*దిశ పోలీసు స్టేషన్లు మహిళలకు భద్రత- సిఎం జగన్*
*విజయవాడలోసోమవారం ఉదయం రాష్ట్రంలో ఉన్న 8 దిశ పోలీసు స్టేషన్లకు ఐ ఎస్ ఓ సర్టిఫికెట్లును రాష్ట్ర* *ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు,*
*ముఖ్యమంత్రి వైఎస్* *జగన్మోహన్ రెడ్డిమాట్లాడుతూ*
*‘మనం వేయాల్సిన అడుగులు చాలా ఉన్నాయి. దిశ యాక్ట్, స్పెషల్ కోర్టుల కోసం మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను రేపటి లోగా నియమించమని చెప్పాం. అలాగే ఫోరెన్సిక్ సిబ్బంది నియామకం, నిర్మాణం కోసం నిధులు కూడా విడుదల చేశాం.ప్రతిదిశపోలీస్స్టేషన్లలో కనీసం 50* *శాతం మహిళలు ఉండేలా చూస్తారు. నెలకోసారి దిశ మీద సమీక్ష చేయాలని నిర్ణయించుకున్నాం. మన పోలీసులను గర్వంగా నిలబెట్టేది.. దిశ రూపంలో మనం చేస్తున్న ప్రయత్నాలే. మహిళలకు భద్రత కల్పించడానికి దిశ ద్వారా మనం ముందడుగు వేశాం. మనకు హోం మంత్రిగా మహిళ ఉన్నారు. సీఎస్ నీలం సాహ్ని కూడా మహిళే. అలాగే దిశ విభాగానికి ఉన్న ఇద్దరు అధికారులు కృతిక, దీపిక కూడా మహిళలే.’ అని సీఎం జగన్ అన్నారు.*