ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అభివృద్ధికి శక్తికి మించి కృషి చేస్తా
December 23, 2019
Andhrapradesh
,
developer
,
governament hospital
,
MLA Sridharreddy
,
Nellore
,
YSRCP
- రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు, డిసెంబర్ 23, (రవికిరణాలు) : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేడు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలను సందర్శించి, ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అభివృద్ధిపై డాక్టర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రధాన వైద్యశాలను అన్ని రకాల వసతులతో అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే వైద్యశాల అభివృద్ధికి మంత్రి అనీల్ కుమార్ యాదవ్ 25 లక్షలు, తాను 10 లక్షల రూపాయలు ఇప్పటికే కేటాయించామన్నారు. రాబోయే రోజుల్లో అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు వెళితే మనం క్షేమంగా తిరిగి ఇంటికి వస్తాము అన్న నమ్మకాన్ని ప్రజలకు కల్పించాలని డాక్టర్లకు సూచించారు. అనేక సామాజిక సేవా సంస్థలతో మాట్లాడుతున్నామని, ఇప్పటికే ప్రణాళిక రూపంలో ఉన్నాయని, మౌలిక పసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అభివృద్ధికి శక్తికి మించి కృషి చేస్తానని అన్నారు.పై కార్యక్రమంలో లక్ష్మీ సునంద, వై.సి.పి. నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర రావు, జిల్లా అధికార ప్రతినిధి బిరుదవోలు శ్రీకాంత్ రెడ్డి, ఏసు నాయుడు తదితరులు పాల్గొన్నారు.