✍️ ఈనెల 14వ తేదీన నెల్లూరులోని  ITDA ఎదుట జరిగే మహాధర్నా కు తరలిరండి
✍️ కావలిలో కరపత్రాల ఆవిష్కరణ, ప్రెస్ మీట్
✍️ గిరిజన యానాదుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తున్న ITDA  అధికారులపై చర్యలు తీసుకొని యానాదులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 14వ తేదీన నెల్లూరులోని ITDA  కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు యానాదుల(గిరిజన) సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు.
 ✍️ ఈరోజు కావలిలోని జర్నలిస్టు క్లబ్ లో  మహా ధర్నా కరపత్రాలను ఆవిష్కరించడమైనది.
✍️   సమస్యల పరిష్కారానికి జరిగే మహాధర్నాకు జిల్లాలోని గిరిజనులు, యానాదులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 
✍️అలాగే 14న ఎసి సుబ్బారెడ్డి స్టేడియం నుండి ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ ఉంటుందని తెలిపారు.                                                    ✍️ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యానాదుల(గిరిజన) సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కెసి పెంచలయ్య,  జిల్లా చైర్మన్ చేవూరు సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాపూరు కృష్ణయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇండ్ల రవి, కావలి డివిజన్ నాయకులు రాపూరు మురళీ, తుపాకుల సుబ్బు, చలంచర్ల హరికృష్ణ, కొమరగిరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.