నెల్లూరు:DCMS ఛైర్మన్ వీరి చలపతిరావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ
మంత్రి డా॥పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ గారితో సమావేశమైన టెక్నికల్ ఎక్స్ఫర్ట్  కమిటీ,DCMS-BM & డైరెక్టర్లు..!
నెల్లూరు నగరం నవాబుపేట వద్ద శిధిలావస్థలో నున్న జిల్లా కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ రైసు మిల్లును గతంలో మంత్రి గారు పరిశీలించి.,దానపై 5మందితో కమిటీ వేయమని జిల్లా కలెక్టరు గారిని కోరడమైనది.
శిధిలావస్థలో నున్న రైసు మిల్లును మరియు పరిసర ప్రాంతాలను పరిశీలించిన కమిటీ సభ్యులు చుట్టుపక్కల రెసిడెన్షియల్ ఏరియా 4-కి.మీ. వున్నందున రైసుమిల్లు పునఃప్రారంభించడానికి అవకాశంలేక పురాతనమైన రైసుమిల్లు యంత్రాలును మరమ్మతులు చేయలేని స్థితిలో వున్నాయని నిర్ధారించారు.
రైసు మిల్లు స్థానంలో అక్కడి ప్రజలు అవసరాలకు ఉపయోగపడే విధంగా షాపింగ్ కాంప్లెక్స్ లేదా గిడ్డంగులు నిర్మించేవిధంగా సంబంధిత రాష్ట్ర మంత్రి కన్నబాబు గారితో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపిన మంత్రి గారు.పై కార్యక్రమంలో టెక్నికల్ కమిటీ సభ్యులు,DCMS డైరెక్టర్లు భాస్కర్ గౌడ్,రవి కుమార్,ఆలీ,BM-వెంకటస్వామి పాల్గొన్నారు.