కావలిలో కర్ఫ్యూ



🔹 ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :   ఎమ్యెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

---------------------------------------------------------

దేశంలో మూడవ వేవ్ ముంచుకొస్తుందన్న వార్తల నేపథ్యంలో కావలి నియోజకవర్గంలోను , కావలి రెవెన్యూ  పరిధిలోను  23 వతేది శుక్రవారం  సాయంత్రం 6 గంటలనుండి ఉదయం 6 వరకు కర్ఫ్యూ విధించడానికి నిర్ణయం తీసుకున్నట్లు  కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి వెల్లడించారు . కావలి ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం జరిగిన కరోన సమీక్షాసమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు . కావలిలో కరోన కేసులు పెరుగుతున్న దృష్ట్యా వ్యాపారస్తుల కొరికమేరకు ఆర్డీఓ ఈ నిర్ణయం గైకొన్నట్లు ఆయన తెలిపారు . కావలిలోని వ్యాపారవర్గాల ప్రతినిధులు వచ్చి తమను కలిసారన్నారు . కరోన థర్డ్ వేవ్ ఉధృతంగా వుంటుందని మేధావులు హెచ్చరికలు చేస్తున్నందున కరోన నియంత్రణకు తామంతా స్వచ్చందంగా దుకాణాలకు మూసివేయడానికి నిర్ణయించుకొన్నామని వ్యాపారస్తులు చెప్పడంతో - కర్ఫ్యూ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు . ఆర్డీఓ శ్రీను నాయక్ , డీఎస్పీ ప్రసాదరావు , కమీషనర్ శివారెడ్డి , డిప్యూటీ డీఎం & హెచ్ ఓ , మరికొందరు అధికారులు వ్యాపారస్తులు ఈ సమావేశంలో కరోన నియంత్రణ సమస్యపై చర్చించామన్నారు .