నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం, ప్రాజెక్ట్ డైరెక్టర్ డి.ఆర్.డి.ఎ శ్రీ వి కె శీనా నాయక్  ఈ రోజు కావలి మునిసిపాలిటీ పరిధిలోని విశ్వోదయా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తూన్నా క్వారంటైన్ సెంటర్ తనిఖీ చేయడం జరిగింది. అక్కడ వసతి పొందుతున్న వారితో  కనీస వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో క్వారంటైన్ సెంటర్ మధ్యాహ్న భోజనం చేసి నాణ్యత పెంచాలని సూచించారు.

ఒర్రిసా రాష్ట్రానికి చెందిన సుమారు 20 మందికి ఇక్కడ క్వారంటైన్ చేస్తున్నారు. వీరి అందరికి  ఆరోగ్య శాఖవారు టెస్టులు చేయగా నెగటివ్ రావడంతో ఈ రోజు వారిని స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు ఈ క్వారంటైన్ సెంటర్ నందు 231మంది కి వసతి కల్పించి క్వారంటైన్ ప్రోటోకాల్ ప్రకారం వారిని హోమ్ ఐసోలాషన్ పంపడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఇంచార్జి మున్సిపల్ కమిషనర్, రెవిన్యూ సిబ్బంది  మరియు ఇతర శాఖల సిబ్బంది వున్నారు.

తదుపరి కావలి మండల పరిషత్ కార్యాలయంలో  ఎంపీడీఓ తో కలసి ప్రస్తుతం వైస్సార్ పెన్షన్స్ లో అర్హత కలిగిన వారికి పెన్షన్ మంజూరు కొరకు వెరిఫికేషన్ ప్రక్రియ చేయాలని కోరారు మండలం లోని లబ్ది దారుల జాబితా పరిశీలించడం జరిగింది.
తదుపరి వైస్సార్ క్రాంతి పథం కావలి మండల సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి వడ్డీలేని రుణాలు, పాత సంఘాల్లో కొత్త సభ్యుల చేకూర్పు, పుస్తక నిర్వహణ మరియు ఆడిట్ అంశాల్లో ప్రగతి సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో APM కాంతరావు వారి సిబ్బంది పాల్గొన్నారు.