బెంగాల్ వలస కూలీల ను పరామర్శించిన* *- కేతంరెడ్డి వినోద్ రెడ్డి*
*బెంగాల్ వలస కూలీల ను పరామర్శించిన*
*- కేతంరెడ్డి వినోద్ రెడ్డి*
నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెరుబొట్లపల్లి గ్రామంలో అస్వస్థత గురైన బెంగాల్ వలస కూలీలను, జనసేన జిల్లా నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన ఘటన మరువకముందే, నెల్లూరు జిల్లాలో ఇటువంటి దుర్ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని ఆయన అన్నారు...వలస కూలీలు అస్వస్థకు పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదని, కలుషిత ఆహారం వల్ల కానీ కలుషిత త్రాగు నీటి వలన కాని ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుని ఉండొచ్చు అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు..
ఆసుపత్రిలో అస్వస్థకు గురి అయిన రోగుల అందరినీ వ్యక్తిగతంగా కలిసి పేరుపేరునా పరామర్శించారు.అనంతరం వైద్యులతో మాట్లాడారు. రోగుల రక్త నమూనాలు వైద్య పరీక్షల కోసం పంపినట్లు వారు తెలియచేసారని,నివేదికలు వస్తే కానీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఆయన తెలియజేశారు.
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా భూగర్భ జలాలు కలుషితం అయ్యాయని, ప్రభుత్వం వెంటనే ప్రతి గ్రామంలో,అలాగే మండల కేంద్రాలలో భూగర్భ జలాల పరీక్షలు నిర్వహించాలని, స్వచ్ఛమైన తాగునీటిని ప్రజలకు అందించాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వ పెద్దల పై ఉందని ఆయన గుర్తు చేశారు.ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వైద్య బృందాలను అప్రమత్తం చేసి రాబోయే సమస్యలను ముందుగా నివారించాలని, ఆయన జిల్లా అధికారులను కోరారు.ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లో జనసేన పార్టీ వారికి అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావుజెన్నీ చంద్రశేఖర్రెడ్డి,కాకు మురళి రెడ్డి సర్వేపల్లి జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, హేమంత్ రాయల్,జాఫర్,