ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం ను సందర్శించిన జిల్లా యస్.పి.
నెల్లూరు జిల్లా
ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం ను సందర్శించిన జిల్లా యస్.పి.
ఈ రోజు తేది.11.08.2021 SPS నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ CH.విజయ రావు,IPS., గారు DPO నందు గల పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ను సందర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా యస్.పి. గారు కమాండ్ కంట్రోల్ లోని వీడియో వాల్, డయల్-100, దిశ కంట్రోల్ రూమ్ వ్యవస్థ పనితీరును పరిశీలించిన పిదప
ఈ మధ్య కాలంలో CC TV పుటేజి ద్వారా చేధించిన కేసులను తెలుసుకొని, నేర నిరోధం మరియు ట్రాఫిక్ నియంత్రణ లో బాగా పని చేస్తున్న సిబ్బందిని అభినందించి సమర్ధతను మరింత పెంచాలని సూచించారు.
అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ CCTV కెమెరాలు, ఏవి పని చేస్తున్నాయి..? ఎక్కడెక్కడ పనిచెయ్యట్లేదు..? ఎందుకు..? వెంటనే మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు.
కాల్ వచ్చిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, ఎటువంటి జాప్యం జరగరాదని,
సౌకర్యాలు ఇంకా ఏమైనా కావాలా అని అడిగి, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, క్రమశిక్షణతో విధులు నిర్వహించండని హెచ్చరించారు.