అద్భుతంగా పోలీస్ బ్యాండ్ తో ప్రదర్శన నిర్వహించిన నెల్లూరు పోలీసులు 
పోలీసు అమరవీరుల స్మృతి వారం సందర్భంగా నెల్లూరు టౌన్ లోని గాంధీ బొమ్మ వద్ద ప్రదర్శన
మైమరిచి పోయిన స్థానికులు ... ఈలలు, చప్పట్లతో ప్రశంసలు 
పోలీస్ బ్యాండ్ బృందాన్ని అభినందించిన జిల్లా యస్.పి.
పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా విధి నిర్వహణలో అమరులైన సిబ్బంది యొక్క త్యాగాలను, వారి సేవాతత్పరతను గూర్చి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈరోజు అనగా తేది. 27.10.2020 న సాయంత్రం 5 గంటలకు నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ భాస్కర్ భూషణ్,IPS., గారి ఆదేశాల మేరకు, నెల్లూరు టౌన్ గాంధీ బొమ్మ వద్ద గల HP పెట్రోల్ బంక్ వద్ద నెల్లూరు టౌన్ సబ్ డివిజన్ పరిధిలో డి.యస్.పి.(ఎ.ఆర్) శ్రీ యం. గాంధీ గారి ఆధ్వర్యంలో పోలీస్ బ్యాండ్ తో ప్రదర్శన నిర్వహించారు.
ఈ ప్రదర్శన విధినిర్వహణలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అసువులు బాసిన సిబ్బంది యొక్క త్యాగాలను గూర్చి నెల్లూరు టౌన్ గాంధీ బొమ్మ వద్ద పోలీస్ సిబ్బందితో కవాతు నిర్వహించి, ప్రజల్లో అవగాహన కల్పించారు. అందులో భాగంగా జాతీయ గీతాలాపన, దేశభక్తి గీతాలు ఆలపించారు.
ఈ సందర్భంగా డి.యస్.పి. గారు మాట్లాడుతూ విధి నిర్వహణలో సేవా తత్పరతను కనబరిచి అమరులైన సిబ్బంది యొక్క స్ఫూర్తిని మనలో నింపుకోవాలని, శాంతియుత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలని, పోలీస్ అమరవీరుల యొక్క సేవలను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించ వలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి.యస్.పి.(ఎ.ఆర్.) శ్రీ యం. గాంధీ గారు, 3 వ పట్టణ పట్టణ సిఐ శ్రీ అన్వర్ బాషా గారు, PRO శ్రీ శ్రీకాంత్ గారు, RI(అడ్మిన్) శ్రీ శ్రీనివాసులు రెడ్డి గారు, ఎస్సైలు, బ్యాండ్ బృందం, ఇతర అధికారులు మరియు సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు. 
జిల్లా పోలీసు కార్యాలయం,
నెల్లూరు.