నెల్లూరు జిల్లాలోని పలు బీచ్‌లు మూసివేస్తున్నారు.
బీచ్‌లు మూసివేత
నెల్లూరు జిల్లాలోని పలు బీచ్‌లు మూసివేస్తున్నారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తోటపల్లి గూడూరు మండలం కొత్తకోడూరు, కాటేపల్లి బీచ్‌లను మూసివేస్తున్నట్లు సిఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. కొత్త కోడూరు బీచ్ మరియు కాటేపల్లి బీచ్ ప్రాంతాలలో గతంలో అలల తాకిడి అధికమై అనేక మంది సముద్రంలో మునిగి ప్రమాదవశాత్తు మరణించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా బీచ్‌లను 30.12.2020, 31.12.2020 మరియు జనవరి 01.01.2021 తేదీలలో మూసివేస్తున్నట్లు తెలిపారు. పర్యాటకులు ఆయా రోజుల్లో బీచ్ ల సందర్శనకు రావొద్దని సూచించారు. ఇందుకూరు పేట మండలం మైపాడు బీచ్ కూడా మూసివేస్తున్నట్లు ఇందుకూరుపేట పోలీసులు తెలిపారు. మూడు రోజుల పాటు బీచ్‌లోకి ఎవరూ రావద్దని పోలీసులు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.