నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం  (పొదలకురు రోడ్డు) ఎదుట ఏ.పి.మునిసిపల్ వర్కర్స్ &ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ ) ఆధ్వర్యంలో నిరసన దీక్షలు.. ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను ఉద్దేశించి మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి రమేష్ , కత్తి శ్రీనివాసులు , భత్తల కృష్ణయ్య, అల్లాడి గోపాల్ తదితరులు ప్రసంగించారు.. పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న సొసైటీ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు గత నాలుగు నెలలుగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు చెల్లించలేదని దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఇప్పటికైనా తమకు వేతనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు... ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఆర్ టీ ఎం ఎస్ పేరుతో పారిశుద్ధ్య కార్మికుల మెడ మీద కత్తి పెట్టే విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు...... నెల్లూరు కార్పొరేషన్ లో పారిశుద్ధ్య కార్మికుల పోరాటం మొదలైంది ఈ పోరాటం తమ సమ్మె వైపు అడుగులు వేస్తోంది....