నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతో పాటు కరోనా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ పిలుపునిచ్చారు. కరోన సెకండ్ వేవ్ ఉదృతంగా వ్యాపిస్తుండడంతో నెల్లూరు నగరంలోని ఆర్టీసీ వద్ద అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వయంగా జిల్లా ఎస్పీ వాహనదారులకు మాస్కులు తొడిగారు. ఇంట్లో నుండి బయటికి వచ్చేటప్పుడు కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు
గూడూరు టవర్ క్లాక్ సెంటర్ లో
👉కరోనా వైరస్ సెకండ్ వేవ్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి..గూడూరు DSP ఎం. రాజగోపాల్ రెడ్డి
👉కోవిడ్ నిబంధనలు పాటించండి లేకుంటే చలానాలు తప్పవు..గూడూరు పట్టణ సిఐ.దశరథ రామారావు
ఈరోజు సాయంత్రం గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్లో కోవిడ్ వైరస్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన గూడూరు పట్టణ పోలీసులు.... ప్రజలు లు కోవిడ్ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పబ్లిక్ లో తిరిగేటప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని,అలాగే వ్యక్తిగత దూరం కూడా పాటించాలని, అనవసరంగా గుంపులుగా తిరగవద్దని కోవిడ్ నిబంధనలు పాటించడం వలన కొంతమేర కోవిడ్ వైరస్ ని అరికట్టే అవకాశం ఉందని లేనిచో చలానాలు కూడా తప్పవని ప్రజలందరూ కోవిడ్ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండి కోవిడ్ వైరస్ వ్యాప్తి నిరోధానికి కృషి చేయాలని గూడూరు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి కోరారు, ఈ అవగాహన కార్యక్రమంలో డిఎస్పీ ఎం. రాజగోపాల్ రెడ్డి తో పాటు గూడూరు పట్టణ సిఐ దశరథ రామారావు,1వ పట్టణ ఎస్సై బ్రహ్మనాయుడు,రోజాలత,ఇతర పోలీసు సిబ్బంది,విద్యార్థులు,కొందరు ప్రజలు పాల్గొన్నారు....
దిశ పోలీస్ స్టేషన్లో 45 పెట్రోలియం వాహనాలు, ఒక ఇంటిగ్రేటెడ్ వాహనాన్ని ప్రారంబించిన ఎస్పీ భాస్కర్ భూషణ్..
-
- పాల్గొన్న ఎఎస్పీ వెంకటరత్నం, శ్రీలక్ష్మీ, దిశ డిఎస్పీ నాగరాజు, టౌన్ డిఎస్పీ శ్రీనివాసులరెడ్డి
- మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చింది..
- ఆపదలో ఉన్న బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు పెట్రోలియం వాహనాలు ఉపయోగపడతాయి..
- దిశ పోలీస్ స్టేషన్లను ప్రారంభించినప్పటి నుంచి మహిళలపై అత్యాచారాలు తగ్గుముఖం పట్టాయి
- అత్యాచార బాధితులకు అండగా ఉంటూ.. వారికి సత్వర న్యాయం చేసేందుకు దిశ అందుబాటులో ఉంటుంది..
కోడి పందాల స్థావరంపై సీ.ఐ మెరుపు దాడి.. ఇద్దరు అరెస్టు.
పొదలకూరు
మండలం ఎర్రబల్లి అటవీ ప్రాంతంలో కోడి పందాలు ఆడుతున్న ఇద్దరు జూదరులను
కోడి పందేలు, ఇతర జూదాల నిర్వహణపై హైకోర్టుతో పాటు ప్రభుత్వం కూడా నిషేధం విధించిందన్నారు. ఎవరైనా బరులను సిద్ధం చేసినా, పందేల నిర్వహణకు ఏర్పాట్లు చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సర్కిల్ పరిధిలో దొంగచాటుగా నిర్వహించే కోడి పందెలాపై సమాచారం తెలిసిన వారు ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు
పాత్రికేయుడి కుమార్తెకు సహాయం చేసిన
అనంతపురం జిల్లా రాయదుర్గం తాలుక గుమ్మగట్ట లో సూర్య దినపత్రికలో విలేకరి గా పనిచేస్తున్న ఓబులేసు కుమార్తె దియా కు గుండె, ఊపిరితిత్తుల వ్యాధితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి సోషల్ మీడియాలో చూసి చలించిపోయి తన వంతుగా సహాయం చెయ్యాలని తలంచి విషయం నంద్యాల లో టీవీ ఛానెల్ పత్రికేయుడి ద్వార పూర్తి వివరాలు కనుక్కొని నేరుగా చిన్నారి దియా తండ్రి అకౌంట్ కు 10,000/- పదివేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని చేసి ఆదుకున్న నంద్యాల తాలుక CI (సర్కిల్ ఇన్స్పెక్టర్) 🙏 టి.మల్లికార్జున
ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు #03.01.2021 ఆదివారం ఉదయం 11 గంటలకు కీ#శే#పొనకా ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనకా మల్లికార్జున రెడ్డి గారి సహాయ సహకారాలతో పేద బ్రాహ్మణుడైన పెద్దలు నారాయణ స్వామి గారికి ట్రై సైకిల్ మరియు నెలకు సరిపడా పల సరుకులు మరియు వస్త్ర దానం ను పంపిణీ కార్యక్రమం నిర్వహించడమైనది. ముఖ్యఅతిథి గూడూరు పట్టణ సిఐ శ్రీ దశరథ రామారావు గారి చేతుల మీదగా అందించడం అయినది. అధ్యక్షుడు క డివేటి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, సెక్రెటరీ G.చంద్రశేఖర్,ట్రెజరర్ కాటురూ శ్రీనివాసులు,కార్యవర్గ సభ్యులు ఆరికట్ల బాలకృష్ణమ నాయుడు,పి.డి కరిముల్లా, కార్పొరేషన్ రవికుమార్, వాచ్ షాప్ రాము, ప్రజేందర్ రెడ్డి,
ఐ.టి.ఐ ప్రభాకర్,పిల్లల శ్రీను,ఆలీ,శ్రీను, రమేష్ (బేకరి), టీచర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
నెల్లూరు ప్రశాంతి నగర్ సమీపంలోని జాతీయ రహదారి వద్ద ముందు వెళుతున్న బైక్ ను తప్పించబోయి ఓ బొలెరో
మహిళలు చట్టాల పై అవగాహన పెంచుకోవాలి వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు
______________
జలదంకి మండలం వేములపాడు ఘర్షణ ఘటనలో పోతల రమణయ్య తీవ్రంగా గాయపడిన నేపధ్యంలో నిందితులైన 13 మందిని సోమవారం చామదల క్రాస్ వద్ద జలదంకి యస్ ఐ వెంకట్రావు అరెస్టు చేసినట్లు డి.యస్.పి ప్రసాద్, సి.ఐ అక్కేశ్వరరావు తెలిపారు.అరెస్టు అయిన వారిలో బద్దిపూడి తిరుపాలు,చేవూరి నాగార్జున, సుబ్రహ్మణ్యం, కూసుపాటి ఏసేబు,మొద్దు అంజయ్య, మొద్దు జయరామయ్య,మొద్దు లక్ష్మయ్య,మొద్దు రామయ్య,మొద్దు రామకృష్ణ,మొద్దు రాంబాబు,పోతల రవిబాబు,పోతల శ్రీ ను, పోతల వెంకటేష్ లు ఉన్నట్లు డి యస్ పి తెలిపారు. యస్ ఐ వెంకట్రావు సమయస్ఫూర్తి తో ప్రమాద తీవ్రత నెలకొందని, సి.ఐ అక్కేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రశాంత త నెలకొల్పినట్లు తెలిపారు. రమణయ్య వర్గానికి చెందిన నలుగురు ఆసుపత్రి లో ఉన్నా రని వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని డి యస్ పి ప్రసాద్ వివరించారు @ జయప్రతాప్ రెడ్డి
జన సేనాని పర్యటనను అడ్డుకోవద్దు.. ఏఐవైఎఫ్ నాయకులకు నోటీసులు నాయకులతో చర్చిస్తున్న సీఐ దశరధ రామయ్య