మర్రిపాడు లో గత రెండు రోజులుగా భారీ వర్షం.. పొంగిపొర్లుతున్న వాగులు వంకలు.. పలు గ్రామాలు జల దిగ్బంధం
మర్రిపాడు లో గత రెండు రోజులుగా భారీ వర్షం.. పొంగిపొర్లుతున్న వాగులు వంకలు.. పలు గ్రామాలు జల దిగ్బంధం.. రాకపోకలకు అంతరాయం.. ▪️నిరంతర పర్యవేక్షణలో మండల స్థాయి అధికారులు.. నివర్ తుఫాను ప్రభావంతో మర్రిపాడు మండలం పరిధిలోని లో గత రెండు రోజులుగా భారీ వర్షపాతం నమోదయింది, బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మండలంలోని చెరువులు నిండాయి. అలుగులు పారుతున్నాయి అంతేకాకుండా ప్రధానం గా చుంచులూరు పడమటి నాయుడు పల్లి సన్ను వారి పల్లి వద్ద ఉధృతనం గా ప్రవహిస్తున్న బొగ్గేరు వాగు వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉండడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించి పూర్తిగా దిగ్బంధంలో నెలకొన్నాయి మర్రిపాడు మండలంలోని పల్లవోలు సన్ను వారి పల్లి భీమవరం రాజుల పాడు చుంచులూరు పేగల్లపాడు దగ్గర వాగు రహదారి పూర్తిగా దిగ్బంధం కావడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ఈదురు గాలులు వీచటంతో పలుచోట్ల వృక్షాలు విరిగిపడి కొంత మేర నష్టం వాటిల్లినప్పటికీ పూర్తి స్థాయిలో నష్టం తప్పింది. మినుము, పెసర వేసుకున్న రైతులు మాత్రం పూర్తిగా ఈ వర్షానికి నష్టపోయారని మర్రిపాడు మండల పరిధిలోని పలు గ్రామాల్లో బుధవారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది ఏడు గ్రామాలు అంధకారంలోనే ఉంటున్నాయి. మండల ఎంపీడీవో సుస్మిత రెడ్డి తహసిల్దార్ ఎస్.కె అబ్దుల్ హమీద్ ఎస్ఐ వీరనారాయణ వారి సిబ్బంది వ్యవస్థ నిరంతరం పర్యవేక్షణలో ఉన్నాయి, ఎప్పటికప్పుడు గ్రామీణ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ పరిస్థితుల్లో తెలుసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తుఫాను ధాటికి మండల పరిధిలోని సన్ను వారి పల్లి భీమవరం పల్లవోలు తిక్కవరం వాహనాల రాకపోకలు వ్యాపార సముదాయాలు పూర్తిగా మూతపడ్డాయి. గ్రామాల ప్రజలు పేర్కొన్నారు గురువారం సాయంత్రం నాటికి 104.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్టు మండల అధికారులు తెలిపారు. మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యుత్ స్తంభాల పరిసరాల్లో నిలబడ కూడదని విద్యుత్ తీగల కింద నడవకూడదన్నారు. నీటి నిల్వలు ఉన్న చోట పిల్లలను వృద్ధులను వెళ్ళనివ్వవద్దని మండల ప్రజలకు అధికారులు సూచించారు మండల తాసిల్దార్ అబ్దుల్ హమీద్ మరియు అధికారులు తమ సిబ్బందితో కలిసి మండలంలోని పలు గ్రామాలు పరిశీలించి ప్రజలకు తగిన సూచనలు సలహాలు తాసిల్దార్ అందించారు