నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్కును  రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు నెల్లూరు రూరల్ వై.ఎస్.ఆర్.సి.పి. ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మరియు అధికారులతో కలిసి  పరిశీలించి పార్కును మరింతగా ఆధునీకరించి  ప్రజలకు ఆహ్లాదకరంగా వుండే విధంగా రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు ముక్కాల ద్వారకనాథ్, వేనాటి శ్రీకాంత్ రెడ్డి, బిజివేముల భాస్కర్ రెడ్డి, కాకాణి శేషారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.