సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఘన స్వాగతం

శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొన్న సి జె


శ్రీవారి దర్శనార్థం గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ శ్రీ ఎన్.వి రమణకు  శ్రీ పద్మావతి అతిథి గృహం వద్ద  టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి ,ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి స్వాగతం పలికారు.
  అనంతరం  శ్రీవారి దర్శనం కోసం ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న జస్టిస్ రమణకు  చైర్మన్, ఈవో, అదనపు ఈవో స్వాగతం పలికారు. 
  జస్టిస్ ఎన్వీ రమణ సతీ సమేతంగా స్వామివారి ఏకాంత సేవలో పాల్గొన్నారు. 
 ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత కుమారి, జిల్లా ప్రధాన న్యాయ మూర్తి శ్రీ రవీంద్ర బాబు, తిరుపతి అదనపు జిల్లా జడ్జి శ్రీ వై.వీర్రాజు, ప్రోటో కాల్ మేజిస్ట్రేట్ శ్రీ పవన్ కుమార్, 
డిఐజి  శ్రీ క్రాంతి రాణా టాటా, సి వి ఎస్ ఓ శ్రీ గోపీనాథ్ జెట్టి, జిల్లా కలెక్టర్ శ్రీ యం. హరి నారాయణన్,తిరుపతి అర్బన్ ఎస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు పాల్గొన్నారు