రాహుల్ గాందీ కర్నూల్ జిల్లా నుండి చేపడుతున్న భారత్ జోడో పాదయాత్ర ను జయప్రదం చేయండి:- నెల్లూరుజిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేవూరు. దేవకుమార్ రెడ్డి
రాహుల్ గాందీ కర్నూల్ జిల్లా నుండి చేపడుతున్న భారత్ జోడో పాదయాత్ర ను జయప్రదం చేయండి:- నెల్లూరుజిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేవూరు. దేవకుమార్ రెడ్డి
తిరుపతి జిల్లా. సూళ్లూరుపేట సూళ్లూరుపేట:-
త్వరలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో రాహుల్ గాంధీ కర్నూల్ జిల్లా నుండి చేపడుతున్న భారత్ జోడో యాత్ర జయప్రదం కావాలని సూళ్లూరుపేట పట్టణంలో ఆర్ అండ్ బి బంగ్లా వద్ద సూళ్లూరుపేట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మావుడూరి వెంకటాచలపతి అధ్వర్యంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. ఆనంతరం ఆర్ అండ్ బి బంగ్లా నుంచి శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవాలయం వరకు 100 కలిశాల శంబులతో పాదయాత్ర చేసుకుంటూ వెళ్లి చెంగాలమ్మ తల్లికి పూజలు చేశారు. ఈకార్యక్రానికి ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి విచ్చేశారు. అనంతరం దేవకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఈ దేశంలో పేద ప్రజలు బ్రతుకు జీవనం సగించలేక పోతున్నారని, పెట్రోల్, డీజిల్ ,వంట గ్యాస్ విపరీతంగా పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 450 రూపాయలు ఉన్న వంట గ్యాస్ ఇప్పుడు బిజెపి ప్రభుత్వం వచ్చాక 1100 పెరిగిందని, ఈ దేశం కోసం పాటుపడిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే మరల కాంగ్రెస్ పార్టీ రావాలిలని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సులూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు హరి నాయుడు, తుమ్మ బాలకృష్ణ ,చంద్రశేఖర్, జానకిరామ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.