ఏడాది క్రితం హత్యకు గురైన తన బాబాయి వై యెస్ వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎవరి తేల్చాలి..తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ
✒️కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయములో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో జిల్లా
తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ
◆తెలుగుదేశం పార్టీ బిసి నాయకుల పై అక్రమ కేసులు పెట్టి వేదించడము మాని ముఖ్యమంత్రి శ్రీ వై యెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది క్రితం హత్యకు గురైన తన బాబాయి వై యెస్ వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎవరి తేల్చాలి
◆పార్టీ పుట్టినప్పటి నుండి తెలుగుదేశం పార్టీ కి అండగా ఉన్న బీసీ లను అనగ త్రొక్కలని ముఖ్యమంత్రి గారు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు
◆తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన ఆదరణ పథకం రద్దుచేశారు, బీసీ కార్పొరేషన్ నిర్వీర్యము చేశారు,స్థానిక సంస్థలో రిజర్వేషన్లు తగ్గించారు ఇవన్నీ చాలవని తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులను వేదించడము మొదలు పెట్టారు
◆తెలుగుదేశం పార్టీ లో బలమయిన బీసీ నాయకులను గుర్తించి వారిని వేదించడము మొదలు పెట్టారు అందులో భాగంగా శ్రీ కె అచ్చంనాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేశారు,శ్రీ అయ్యన్నపాత్రుడు గారిపై నిర్భయ కేసు నమోదు చేశారు,పెళ్లికి హాజరైనందుకు శ్రీ యనమల రామకృష్ణుడు గారి పై యెస్ సి, యెస్ టి కేసు నమోదు చేశారు,శ్రీ బీదా రవిచంద్ర గారిపై శాసనమండలిలోనే దాడి చేశారు,నేడు మృదుస్వభావి అయిన మాజీ మంత్రి కోల్లు రవీంద్ర ను హత్యా కేసులో ఇరికించి అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు
వ్యకిగత కక్షల తో హత్యకు గురైన వైసీపీ నాయకుని హత్యకేసుకి రాజకీయ రంగు పులిమి దానిలో కొల్లు రవీంద్రను ఇరికించారు
◆ప్రభుత్వం ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకుల పై అక్రమ కేసులు పెట్టి వేదించడానికి పోలీసు వ్యవస్థను ఉపయోగించడము మాని రాష్ట్రములో మహిళలు పై జరుగుతున్న అత్యాచారాలను,దొంగతనాలు అరికట్టడానికి ఉపయోగించాలి