కరోనా బాబా అలియాస్ ఇస్మాయిల్ బాబాను పోలీసులు అరెస్టు
July 25, 2020
Arrest
,
baba
,
case
,
cheater
,
Crime
,
ismail
,
karona
,
miyapur
,
police
,
telengana
మాయలు, మంత్రాలతో కరోనా వ్యాధిని నయం చేస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న
కరోనా బాబా అలియాస్ ఇస్మాయిల్ బాబాను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ మియాపూర్ పరిధిలోని హఫీజ్ పేట్ హనీఫ్ కాలనీకి చెందిన ఇస్మాయిల్ బాబా అమాయకుల నుంచి డబ్బులు దండుకుంటున్నాడు. కరోనాను నయం చేస్తానంటూ తన శిష్యులతో ప్రచారం చేయించుకుని.. తన దగ్గరకు వచ్చిన వారి చేతిలో నిమ్మకాయాలు చేతిలో పెట్టి.. నుదుటికింత విభూతి పూసి.. కరోనా పోయింది.. పో అంటూ పంపిస్తున్నాడు. ఇక నుంచి మాస్కు పెట్టుకోవాల్సిన అవసరం గానీ ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం గానీ లేదంటూ భరోసా ఇస్తున్నాడు. ఇందుకోసం సదరు మాయ బాబా ఏకంగా రూ.50 వేలు వసూలు చేస్తున్నాడు.
అయితే కరోనా బాబాను నమ్మి మోసపోయిన బాధితులు అర్ధరాత్రి సమయంలో మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు మంత్రాలు, నిమ్మకాయలు, విభూతితో పూజలు చేస్తూ అమాయకులను ఎలా మోసం చేస్తున్నాడో తెలుసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌ను తరలించారు. సుమారు 70 మందికి పైగా బాబా చేతిలో మోసపోయినట్లు తమ విచారణలో తేలిందన్నారు. కరోనా సోకిన వ్యక్తులు ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలని, మంత్రాలతో కరోనా వైరస్ అంతం కాదని పోలీసులు సూచిస్తున్నారు.